గుత్తిలో భారీగా ఎర్రచందనం స్వాధీనం | Huge red scandlers seized by police | Sakshi
Sakshi News home page

గుత్తిలో భారీగా ఎర్రచందనం స్వాధీనం

Apr 12 2016 7:30 AM | Updated on Sep 3 2017 9:47 PM

అనంతపురం జిల్లాలోని గుత్తి టౌన్‌ప్లాజా వద్ద మంగళవారం ఉదయం పోలీసులు తనిఖీలు చేపట్టారు.

అనంతపురం: అనంతపురం జిల్లాలోని గుత్తి టౌన్‌ప్లాజా వద్ద మంగళవారం ఉదయం పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో భాగంగా టౌన్‌ప్లాజా వద్ద బెంగళూరుకు లారీలో అక్రమంగా తరలిస్తున్న భారీగా ఎర్రచందనం దుంగలను పోలీసులు గుర్తించారు. అది గమనించిన 30 ఎర్రచందనం కూలీలు పోలీసులను చూసి పరారైనట్టు తెలుస్తోంది.

ఎర్రచందనం కూలీలను వెంటాడి వారిలో 10 మందిని పోలీసులు పట్టుకున్నారు. ఎర్రచందనం లోడ్‌తో (కెఎ 07 7939) నెంబర్‌ గల లారీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement
 
Advertisement
Advertisement