breaking news
lorry load
-
చోరీ జరిగిందంటూ లారీ లోడు మాయం
ఉంగుటూరు : చోరీ జరిగిందంటూ సుగణ బర్డ్ ఫీడింగ్ పరిశ్రమకు చెందిన లారీ లోడును అమ్మేసుకున్న మోసగాళ్లను ఎట్టకేలకు పోలీసులు పట్టుకున్నారు. చేబ్రోలు పోలీసులు కథనం ప్రకారం వివరాలిలా, తాడేపల్లిగూడెంనకు చెందిన మహ్మద్, ఇక్బాల్, హుస్సేన్ అలియాస్ బాషా కొన్నేళ్ల నుంచి సొంతగా రెండు లారీలతో నేషనల్ లారీ సప్లయి ఆఫీస్ నడుపుతున్నారు. ఈ క్రమంలో కిరాయి నిమిత్తం ఏపీ 16 యూ 4851 అను నెంబరు గల తమ లారీని ఈ నెల 14న మహారాష్ట్రలోని వార్దా జిల్లా హింగన్ ఘాట్‌కు పంపించారు. అక్కడ గల సుగణ బర్డ్ ఫీడింగ్ పరిశ్రమ నుంచి సుమారు రూ.6 లక్షల విలువైన 17 టన్నుల(321 బస్తాల) సోయా తవుడును లోడ్ చేయించారు. ఈ సరుకును శ్రీకాకుళం జిల్లా రణస్థలం వద్ద గల సుగుణ వారి గోడౌన్‌కు చేర్చాల్సి ఉంది. అయితే రణస్థలం వెళ్లవలసిన లారీని దారి మళ్లించి 17వ తేదీన తాడేపల్లిగూడెం రప్పించారు. లోడును మండపాకలోని ఓ పౌల్ట్రీఫారం యజమానికి రూ.5.20 వేలకు అమ్మేశారు. లోడ్ ఇచ్చిన సుగుణ కంపెనీ వారికి వెంకట్రామన్నగూడెం వద్ద సరుకు చోరీకి గురైందని చెప్పారు. ఈ నెల 26న సాయంత్ర చేబ్రోలు పోలీసుస్టేçÙన్కు డ్రైవర్‌ను తీసుకు వచ్చి తప్పుడు రిపోర్టు ఇప్పించారు. కేసు నమోదు చేసిన చేబ్రోలు ఎస్సై చావా సురేష్ దర్యాప్తు ప్రారంభించి తదనంతరం కేసును గణపవరం సీఐ దుర్గాప్రసాద్‌కు అప్పజెప్పారు. ఈ క్రమంలో దర్యాప్తు ముమ్మరం చేయగా మోసం బయటపడింది. నిందింతులు మహమ్మద్, ఇక్బాల్, హుస్సేన్ అలియాస్ భాషాలను అరెస్టు చేసి కోర్టుకు తరలించగా రిమాండ్ విధించారని ఎస్సై చెప్పారు. -
గుత్తిలో భారీగా ఎర్రచందనం స్వాధీనం
అనంతపురం: అనంతపురం జిల్లాలోని గుత్తి టౌన్‌ప్లాజా వద్ద మంగళవారం ఉదయం పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో భాగంగా టౌన్‌ప్లాజా వద్ద బెంగళూరుకు లారీలో అక్రమంగా తరలిస్తున్న భారీగా ఎర్రచందనం దుంగలను పోలీసులు గుర్తించారు. అది గమనించిన 30 ఎర్రచందనం కూలీలు పోలీసులను చూసి పరారైనట్టు తెలుస్తోంది. ఎర్రచందనం కూలీలను వెంటాడి వారిలో 10 మందిని పోలీసులు పట్టుకున్నారు. ఎర్రచందనం లోడ్‌తో (కెఎ 07 7939) నెంబర్ గల లారీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
న్యూఢిల్లీ వెళ్తున్న గంజాయి లోడ్ లారీ సీజ్
వరంగల్: వరంగల్ జిల్లాలో తొర్రూర్ సమీపంలో పోలీసులు శనివారం తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా లారీలో భారీ ఎత్తున అక్రమంగా తరలిస్తున్న గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. లారీలోని 30 బ్యాగుల గంజాయిని స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. అనంతరం డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. స్వాధీనం చేసుకున్న గంజాయిని తూర్పు గోదావరి జిల్లా నుంచి ఢిల్లీకి తరలిస్తున్నట్లు డ్రైవర్ వెల్లడించారని పోలీసులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.