వరంగల్ జిల్లాలో తొర్రూర్ సమీపంలో పోలీసులు శనివారం తనిఖీలు నిర్వహించారు.
వరంగల్: వరంగల్ జిల్లాలో తొర్రూర్ సమీపంలో పోలీసులు శనివారం తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా లారీలో భారీ ఎత్తున అక్రమంగా తరలిస్తున్న గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. లారీలోని 30 బ్యాగుల గంజాయిని స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. అనంతరం డ్రైవర్ను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్కు తరలించారు.
స్వాధీనం చేసుకున్న గంజాయిని తూర్పు గోదావరి జిల్లా నుంచి ఢిల్లీకి తరలిస్తున్నట్లు డ్రైవర్ వెల్లడించారని పోలీసులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.