హెచ్‌ఎం పోస్టల భర్తీ | HM posts fillup | Sakshi
Sakshi News home page

హెచ్‌ఎం పోస్టల భర్తీ

Dec 31 2016 11:36 PM | Updated on Sep 5 2017 12:03 AM

జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల్లో పనిచేస్తున్న టీచర్లకు పదోన్నతులు కల్పించి.. ఖాళీగా ఉన్న ప్రధానోపాధ్యాయ స్థానాలను భర్తీ చేశారు.

కర్నూలు సిటీ: జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల్లో పనిచేస్తున్న టీచర్లకు పదోన్నతులు కల్పించి.. ఖాళీగా ఉన్న ప్రధానోపాధ్యాయ స్థానాలను భర్తీ చేశారు. ఇందుకు శనివారం డీఈఓ కార్యాలయంలో కౌన్సెలింగ్‌ నిర్వహించారు. మొత్తం 20 ఖాళీలు ఉంటే 19 మంది హాజరయ్యారు. వికలాంగుల కోటా కింద ఒక పోస్టుకు అర్హులు లేరు. దీంతో 19 హెచ్‌ఎం పోస్టులు భర్తీ చేశారు. అనంతరం పదోన్నతులు పొందిన వారికి నియమాక పత్రాలను అందజేశారు. కార్యక్రమంలో డీఈఓ రవీంద్రనాథ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement