ద్రోణి ప్రభావంతో సీమాంధ్రలో భారీ వర్షాలు | heavy rains in seemandhra | Sakshi
Sakshi News home page

ద్రోణి ప్రభావంతో సీమాంధ్రలో భారీ వర్షాలు

Jul 31 2016 10:20 AM | Updated on Sep 4 2017 7:13 AM

ఒడిశా నుంచి కోస్తాంధ్ర మీదుగా దక్షిణ తమిళనాడు వరకు అల్పపీడన ద్రోణి ఏర్పడింది.

విశాఖపట్నం : ఒడిశా నుంచి కోస్తాంధ్ర మీదుగా దక్షిణ తమిళనాడు వరకు అల్పపీడన ద్రోణి ఏర్పడిందని విశాఖపట్నంలోని వాతావరణ కేంద్రం ఆదివారం వెల్లడించింది. సోమవారంలోగా అది వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనంగా మారే అవకాశం ఉందని తెలిపింది. ద్రోణి ప్రభావంతో కోస్తాంధ్ర, రాయలసీమలో పలుచోట్ల భారీ వర్షాలు పడతాయని పేర్కొంది.

దక్షిణ కోస్తా తీరం వెంబడి గంటకు 45 నుంచి 50 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీస్తాయని చెప్పింది. చేపల వేటకు వెళ్లే మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.

Advertisement
 
Advertisement
Advertisement