సీమాంధ్రలో భారీ వర్షాలు పడే అవకాశం | heavy rains in seemandhra | Sakshi
Sakshi News home page

సీమాంధ్రలో భారీ వర్షాలు పడే అవకాశం

May 17 2016 4:15 PM | Updated on Sep 4 2017 12:18 AM

బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడిందని విశాఖపట్నంలోని వాతావరణ కేంద్రం మంగళవారం వెల్లడించింది.

విశాఖపట్నం : బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడిందని విశాఖపట్నంలోని వాతావరణ కేంద్రం మంగళవారం వెల్లడించింది. ఇది చెన్నైకి నైరుతి దిశగా 240 కి.మీ దూరంలో కేంద్రీకృతమైందని తెలిపింది. వాయుగుండం ప్రభావంతో తమిళనాడులో వర్షాలు కురుస్తాయని పేర్కొంది. అలాగే కోస్తాంధ్ర, రాయలసీమలో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని విశాఖలోని వాతావరణ కేంద్రం వివరించింది. రాగాల 24 గంటల్లో చాలా చోట్ల ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉందని తెలిపింది.

Advertisement
 
Advertisement
Advertisement