డెల్టాలో కుండపోత | HEAVY RAIN IN DELTA | Sakshi
Sakshi News home page

డెల్టాలో కుండపోత

Jun 17 2017 1:40 AM | Updated on Sep 5 2017 1:47 PM

డెల్టాలో కుండపోత

డెల్టాలో కుండపోత

జిల్లా అంతటా ఆవరించిన మేఘాలు రెండు రోజులుగా వర్షిస్తున్నాయి. శుక్రవారం ఉదయం 8.30 గంటల సమయానికి జిల్లాలో 32.7 మిల్లీవీుటర్ల సగటు వర్షపాతం...

ఏలూరు (ఆర్‌ఆర్‌ పేట)/కొవ్వూరు : మేఘం ముసిరింది.. చిటపట చినుకుల కళ్లాపి చల్లింది. కాసేపటికే జల్లుల జావళి జోరెత్తింది. వేడెక్కిన పుడమి పొరల్లోకి ఆకాశ గంగ చొచ్చుకెళ్లింది. వేసవి తాపాన్ని చల్లార్చింది.  మట్టి వాసనల్ని ముక్కు పుటాల వరకు వెదజల్లింది. జిల్లా అంతటా ఆవరించిన మేఘాలు రెండు రోజులుగా వర్షిస్తున్నాయి. శుక్రవారం ఉదయం 8.30 గంటల సమయానికి జిల్లాలో 32.7 మిల్లీవీుటర్ల సగటు వర్షపాతం నమోదైంది.
డెల్టాలో కుండపోత వర్షం కురిసింది. శుక్రవారం 8.30 గంటల సమయానికి గడచిన 24 గంటల్లో జిల్లాలో సగటున 32.7 మిల్లీవీుటర్ల వర్షపాతం నమోదైంది. అత్యధికంగా పాలకోడేరులో 110.6 మిల్లీవీుటర్ల వర్షం కురవగా.. అత్యల్పంగా టి.నరసాపురంలో 2.2 మిల్లీవీుటర్లు నమోదైంది. పెనుగొండలో 87.4, ఆచంటలో 85.2, పోడూరులో 80.4, ఉండిలో 81.8, గణపవరంలో 66.4, పెనుమంట్రలో 60.8, మొగల్తూరులో 56.4, నరసాపురం పట్టణంలో 51 మిల్లీవీుటర్ల చొప్పున వర్షపాతం నమోదైంది. ఏలూరు నగరంలో 10.8, జీలుగుమిల్లిలో 5.2, బుట్టాయగూడెంలో 22, పోలవరంలో 4.4, తాళ్లపూడిలో 8, గోపాలపురంలో 4.6, కొయ్యలగూడెంలో 8.4, జంగారెడ్డిగూడెం పట్టణంలో 21.2, చింతలపూడిలో 2.6, లింగపాలెంలో 5.4, కామవరపుకోటలో 17.2, ద్వారకాతిరుమలలో 43.4, నల్లజర్లలో 46.8, దేవరపల్లిలో 12.6, చాగల్లులో 14.2, కొవ్వూరు పట్టణంలో 15, నిడదవోలులో 30.2, తాడేపల్లిగూడెం పట్టణంలో 35.8, ఉంగుటూరులో 36.8, భీమడోలులో 25.4, పెదవేగిలో 8, పెదపాడులో 11.4, దెందులూరులో 14, నిడమర్రులో 16, పెంటపాడులో 27.6, తణుకు పట్టణంలో 37.4, ఉండ్రాజవరంలో 43, పెరవలిలో 28, ఇరగవరంలో 43, అత్తిలిలో 38, ఆకివీడులో 37, కాళ్లలో 51, భీమవరం పట్టణంలో 45, వీరవాసరంలో 40, పాలకొల్లు పట్టణంలో 35, యలమంచిలిలో 40.4 మిల్లీవీుటర్ల వర్షపాతం నమోదైంది. 
 

Advertisement
 
Advertisement
Advertisement