breaking news
AVERAGE RAIN FALL
-
అయినా లోటే...
సాక్షి,న్యూఢిల్లీ: పలు రాష్ట్రాలను వర్షాలు ముంచెత్తినా సగటు వర్షపాతం కన్నాతక్కువ నమోదవడం ఆందోళన కలిగిస్తోంది.ఈ ఏడాది దేశవ్యాప్తంగా వర్షాలు అంచనాల కంటే తక్కువగానే నమోదయ్యాయని, మధ్య, ఈశాన్య రాష్ట్రాల్లో పంటలకు అవసరమైన మేర వర్షపాతం లేదని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) పేర్కొంది. ఈ ఏడాది సాధారణ వర్షపాతం ఉంటుందని, 98 శాతం మేర వర్షాలు నమోదవుతాయని ఐఎండీ అంచనా వేయగా కేవలం 95 శాతం మేర వర్షాలు కురిశాయి. దీంతో వరుసగా నాలుగో ఏడాది వర్షపాతంపై ఐఎండీ అంచనాలు ఫలించలేదు. పప్పు ధాన్యాలు పండే మధ్య ప్రదేశ్, వరిని విరివిగా పండించే హర్యానా, పంజాబ్ తదితర రాష్ట్రాల్లో తక్కువ వర్షపాతం నమోదవడంతో దేశవ్యాప్తంగా సగటు వర్షపాతం కన్నా తక్కువ వర్షాలు నమోదయ్యాయి. గత ఏడాదితో పోలిస్తే వరి దిగుబడి రెండు శాతం తగ్గుతుందని, సోయాబీన్ దిగుబడులు 8 శాతం తగ్గుతాయని ప్రభుత్వం పేర్కొంది. ఐఎండీ తొలిసారిగా తన అంచనాల్లో కచ్చితత్వాన్ని మెరుగుపరిచేందుకు అమెరికా అనుసరించే డైనమిక్ మోడల్‌ను ప్రవేశపెట్టింది. ఈ పద్ధతి అమలైన తర్వాత ఐఎండీ అంచనాల్లో స్వల్ప వ్యత్యాసాలు మాత్రం కొనసాగుతనే ఉన్నాయి. -
డెల్టాలో కుండపోత
ఏలూరు (ఆర్ఆర్ పేట)/కొవ్వూరు : మేఘం ముసిరింది.. చిటపట చినుకుల కళ్లాపి చల్లింది. కాసేపటికే జల్లుల జావళి జోరెత్తింది. వేడెక్కిన పుడమి పొరల్లోకి ఆకాశ గంగ చొచ్చుకెళ్లింది. వేసవి తాపాన్ని చల్లార్చింది. మట్టి వాసనల్ని ముక్కు పుటాల వరకు వెదజల్లింది. జిల్లా అంతటా ఆవరించిన మేఘాలు రెండు రోజులుగా వర్షిస్తున్నాయి. శుక్రవారం ఉదయం 8.30 గంటల సమయానికి జిల్లాలో 32.7 మిల్లీవీుటర్ల సగటు వర్షపాతం నమోదైంది. డెల్టాలో కుండపోత వర్షం కురిసింది. శుక్రవారం 8.30 గంటల సమయానికి గడచిన 24 గంటల్లో జిల్లాలో సగటున 32.7 మిల్లీవీుటర్ల వర్షపాతం నమోదైంది. అత్యధికంగా పాలకోడేరులో 110.6 మిల్లీవీుటర్ల వర్షం కురవగా.. అత్యల్పంగా టి.నరసాపురంలో 2.2 మిల్లీవీుటర్లు నమోదైంది. పెనుగొండలో 87.4, ఆచంటలో 85.2, పోడూరులో 80.4, ఉండిలో 81.8, గణపవరంలో 66.4, పెనుమంట్రలో 60.8, మొగల్తూరులో 56.4, నరసాపురం పట్టణంలో 51 మిల్లీవీుటర్ల చొప్పున వర్షపాతం నమోదైంది. ఏలూరు నగరంలో 10.8, జీలుగుమిల్లిలో 5.2, బుట్టాయగూడెంలో 22, పోలవరంలో 4.4, తాళ్లపూడిలో 8, గోపాలపురంలో 4.6, కొయ్యలగూడెంలో 8.4, జంగారెడ్డిగూడెం పట్టణంలో 21.2, చింతలపూడిలో 2.6, లింగపాలెంలో 5.4, కామవరపుకోటలో 17.2, ద్వారకాతిరుమలలో 43.4, నల్లజర్లలో 46.8, దేవరపల్లిలో 12.6, చాగల్లులో 14.2, కొవ్వూరు పట్టణంలో 15, నిడదవోలులో 30.2, తాడేపల్లిగూడెం పట్టణంలో 35.8, ఉంగుటూరులో 36.8, భీమడోలులో 25.4, పెదవేగిలో 8, పెదపాడులో 11.4, దెందులూరులో 14, నిడమర్రులో 16, పెంటపాడులో 27.6, తణుకు పట్టణంలో 37.4, ఉండ్రాజవరంలో 43, పెరవలిలో 28, ఇరగవరంలో 43, అత్తిలిలో 38, ఆకివీడులో 37, కాళ్లలో 51, భీమవరం పట్టణంలో 45, వీరవాసరంలో 40, పాలకొల్లు పట్టణంలో 35, యలమంచిలిలో 40.4 మిల్లీవీుటర్ల వర్షపాతం నమోదైంది.