ఎస్సారెస్పీలోకి భారీ వరద నీరు | Heavy flood water into the SRSP | Sakshi
Sakshi News home page

ఎస్సారెస్పీలోకి భారీ వరద నీరు

Sep 18 2016 8:22 PM | Updated on Aug 1 2018 3:59 PM

శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్‌లోకి భారీ ఇన్‌ఫ్లో వచ్చి చేరుతోంది.

శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్‌లోకి ఎగువ ప్రాంతాల నుంచి కురుస్తున్న వర్షాల వలన భారీ ఇన్‌ఫ్లో వచ్చి చేరుతోంది. వర్షాలకు, ఎగువ ప్రాంతం ప్రాజెక్ట్‌ల వరద నీరు కూడ తోడవ్వడంతో రోజు రోజుకు ఇన్‌ఫ్లో పెరుగుతోంది. ప్రాజెక్ట్‌లోకి ఆదివారం ఉదయం 80 వేల క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరింది. సాయంత్రానికి 20 వేల క్యూసెక్కులకు తగ్గిపోయింది. దీంతో ప్రాజెక్ట్ నీటి మట్టం శరవేగంగా పెరుగుతోంది. ప్రాజెక్ట్ నుంచి కాకతీయ కాలువ ద్వార 6,500 క్యూసెక్కులు, లక్ష్మీ కాలువ ద్వార 200 క్యూసెక్కులు, గుత్ప, అలీసాగర్ ఎత్తిపోతల పథకం ద్వార 417 క్యూసెక్కుల నీటి విడుదల జరుగుతోంది. ప్రాజెక్ట్ నుంచి కాకతీయ కాలువ ద్వార నీటి విడుదల కొనసాగుతుడటంతో స్థానిక జల విద్యుదుత్పత్తి కేంద్రంలో మూడు టర్బయిన్ల ద్వార 17 మెగావాట్ల విద్యుదుత్పత్తి జరుగుతుందని జెన్‌కో అధికారులు తెలిపారు. ప్రాజెక్ట్ పూర్తి స్థాయి నీటి మట్టం 1091(90 టీఎంసీలు) అడుగులు కాగా ఆదివారం సాయంత్రానికి ప్రాజెక్ట్‌లో 1078.50(48.44 టీఎంసీలు) అడుగుల నీరు నిల్వ ఉందని ప్రాజెక్ట్ అధికారులు తెలిపారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement