పాపాలు తగిలిపోతారు | Gutta fires on KCR,KTR | Sakshi
Sakshi News home page

పాపాలు తగిలిపోతారు

May 1 2016 2:48 AM | Updated on Aug 30 2019 8:24 PM

పాపాలు తగిలిపోతారు - Sakshi

పాపాలు తగిలిపోతారు

అధికార మదంతో సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ కాంగ్రెస్ పార్టీపై ఇష్టానుసారంగా విమర్శలు చేస్తున్నారని ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు.

సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌లపై ‘గుత్తా’ ధ్వజం
 
 నల్లగొండ: అధికార మదంతో సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ కాంగ్రెస్ పార్టీపై ఇష్టానుసారంగా విమర్శలు చేస్తున్నారని ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. శనివారం నల్లగొండలో విలేకరులతో ఆయన మాట్లాడుతూ, కాంగ్రెస్‌పై చేసిన విమర్శలు వెనక్కి తీసుకోకుంటే పాపాలు తగిలిపోతారని హెచ్చరించారు.

కాంగ్రెస్ పార్టీ దేశానికి పట్టిన శని అని, దరిద్రపు కాంగ్రెస్ అని ఇష్టం వచ్చినట్లుగా వ్యాఖ్యలు చేయడం వారి అహంకారానికి పరాకాష్టగా నిలిచిందని మండిపడ్డారు. తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ కాదా? సోని యా, రాహుల్‌లకు కృతజ్ఞతలు చెప్పడానికి కేసీఆర్ కుటుంబ సభ్యులతో కలసి వెళ్లడం నిజం కాదా? అప్పుడు గుర్తుకు రాలేదా దరిద్ర కాంగ్రెస్ పార్టీ అని గుత్తా ప్రశ్నించారు. 2004 ఎన్నికల్లో కాంగ్రెస్‌తో కలసి పోటీ చేసిన సంగతిని కేసీఆర్ విస్మరించరాదని చెప్పారు.

Advertisement
 
Advertisement
Advertisement