విలువ ఆధారిత పన్ను చట్టం, 2005 (వ్యాట్) స్థానంలో వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) చట్టం శనివారం నుంచి అమలులోకి రానుంది.
అనంతపురం : విలువ ఆధారిత పన్ను చట్టం, 2005 (వ్యాట్) స్థానంలో వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) చట్టం శనివారం నుంచి అమలులోకి రానుంది. వాణిజ్య పన్నుల శాఖ అనంతపురం డివిజన్ పరిధిలోని రిజిష్టర్ డీలర్లకు కొత్త చట్టంపై అవగాహన కల్పించేందుకు, వారి సందేహాలను నివృత్తి చేయడానికి అధికారులు చర్యలు చేపట్టారు.
సందేహాలు నివృత్తి చేసుకోవచ్చు :
డివిజన్, సర్కిల్ పరిధిలోని జీఎస్టీ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. ఆయా కేంద్రాల్లో లేదా మెయిల్ ద్వారా సందేహాలను నివృత్తి చేసుకోవాలని అధికారులు సూచించారు. డివిజన్ పరిధిలోని డీలర్లు జీఎస్టీ ఉప అధినేత టి.శేషాద్రి సెల్ : 9959552441ని సంప్రదించొచ్చు. అనంతపురం సర్కిల్–1 పరిధిలోని డీలర్లు జీఎస్టీ సహాయ అధినేత పి.ఎర్రయ్య సెల్ : 80082 77270లో సంప్రదించాలి. అనంతపురం సర్కిల్–2 పరిధిలోని డీలర్లు జీఎస్టీ సహాయ అధినేత ఎం. సుధాకర్ సెల్: 99499 92660 లో సంప్రదించాలి. గుంతకల్లు సర్కిల్ పరిధిలోని డీలర్లు జీఎస్టీ సహాయ అధినేత జి.రాజేంద్రప్రసాద్ సెల్ : 99499 92924లో సంప్రదించాలి. తాడిపత్రి సర్కిల్ పరిధిలోని డీలర్లు జీఎస్టీ సహాయ అధినేత ఎస్. సోనియాతార సెల్ : 98858 93710లో సంప్రదించాలి. హిందూపురం సర్కిల్ పరిధిలోని డీలర్లు జీఎస్టీ సహాయ అధినేత డి.నాగేంద్రరెడ్డి సెల్ : 99499 92698లో సంప్రదించాలి. ధర్మవరం సర్కిల్ పరిధిలోని డీలర్లు జీఎస్టీ సహాయ అధినేత జి.వెంకటేశ్వరరెడ్డి సెల్ : 99499 92627లో సంప్రదించాలి.