వేరుశనగ కొనుగోలు కేంద్రాలు ప్రారంభం | groundnut sales counter starts | Sakshi
Sakshi News home page

వేరుశనగ కొనుగోలు కేంద్రాలు ప్రారంభం

Jan 5 2017 11:43 PM | Updated on Jun 1 2018 8:39 PM

జిల్లాలో వేరుశనగ కొనుగోలు కేంద్రాలు ప్రారంభమయ్యాయి. బుధవారం లాంఛనంగా ప్రారంభించినా గురువారం కొద్దిగా కొనుగోళ్లు జరిగాయి.

అనంతపురం అగ్రికల్చర్‌ : జిల్లాలో వేరుశనగ కొనుగోలు కేంద్రాలు ప్రారంభమయ్యాయి. బుధవారం లాంఛనంగా ప్రారంభించినా గురువారం కొద్దిగా కొనుగోళ్లు జరిగాయి. ఆయిల్‌ఫెడ్‌ ఆధ్వర్యంలో అనంతపురం, కళ్యాణదుర్గం, గుత్తి, తాడిపత్రి, పెనుకొండ, కదిరి, ధర్మవరం మార్కెట్‌ యార్డుల్లో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు. కేంద్ర ప్రభుత్వం వేరుశనగకు ఈ ఏడాది కనీస మద్దతు ధర క్వింటాలుకు రూ.4,220 ప్రకారం ప్రకటించిన విషయం తెలిసిందే. అదే ధరతో కొనుగోళ్లు జరుపుతున్నట్లు ఆయిల్‌ఫెడ్‌ అధికారులు తెలిపారు. ఎలాంటి ప్రచారం లేకుండా కేంద్రాలు ప్రారంభించడంతో వెలవెలబోయాయి.

అవుటన్‌ 65 శాతం అంతకన్నా ఎక్కువ ఉంటేనే కొనుగోలు చేయనున్నట్లు ప్రకటించారు. అలాగే పంట వేసి పండించినట్లు తహశీల్దార్‌ / ఏఓ / వీఆర్వోల ద్వారా ధ్రువీకరణ పత్రం తీసుకురావాలని సూచించారు. పట్టాదారు పాసుపుస్తకం, ఆధార్‌కార్డు, బ్యాంకు అకౌంట్‌ నంబర్‌ సమర్పించాల్సి ఉందన్నారు. 65 శాతం అవుటన్‌ ఉండాలనే నిబంధన పెట్టడంతో రైతులకు ఇబ్బందిగా పరిణమించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement