డెంగీ బాధితులను ఆదుకుంటాం | govt help dengi effected familys | Sakshi
Sakshi News home page

డెంగీ బాధితులను ఆదుకుంటాం

Aug 28 2016 9:02 PM | Updated on Jul 11 2019 5:37 PM

డెంగీ బాధితులను ఆదుకుంటాం - Sakshi

డెంగీ బాధితులను ఆదుకుంటాం

డెంగీ బాధిత కుటుంబాలను ప్రభుత్వ పరంగా ఆదుకుంటామని మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు పేర్కొన్నారు. గ్రామంలో డెంగీ లక్షణాలతో మృతి చెందిన కనపర్తి పుల్లయ్య, జోజి కుటుంబ సభ్యులను ఆయన ఆదివారం పరామర్శించారు.

ముచ్చింతాల (పెనుగంచిప్రోలు) : 
డెంగీ బాధిత కుటుంబాలను ప్రభుత్వ పరంగా ఆదుకుంటామని మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు పేర్కొన్నారు. గ్రామంలో డెంగీ లక్షణాలతో మృతి చెందిన కనపర్తి పుల్లయ్య, జోజి కుటుంబ సభ్యులను ఆయన ఆదివారం పరామర్శించారు. గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన వైద్యశిబిరాన్ని సందర్శించి రోగులకు మెరుగైన వైద్యం అందించాలని వైద్యులు అనిల్‌కుమార్, సుష్మలకు సూచించారు. డీఎంహెచ్‌వో నామల్లేశ్వరి కూడా గ్రామంలో పర్యటించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్, తహసీల్దార్‌ కె నాగేశ్వరరావు, జెడ్పీటీసీ సభ్యురాలు గింజుపల్లి శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement