వరంగల్ రైల్వే స్టేషన్ వద్ద మంగళవారం ఉదయం గూడ్స్ రైలు(బీటీపీఎన్) పట్టాలు తప్పింది
-ఊడిపోయిన రైలు చక్రాలు
-వరంగల్ రైల్వే స్టేషన్ వద్ద సంఘటన
రైల్వేగేట్ (వరంగల్) :
వరంగల్ రైల్వే స్టేషన్ వద్ద మంగళవారం ఉదయం గూడ్స్ రైలు(బీటీపీఎన్) పట్టాలు తప్పింది. మంగళవారం సుమారు 58 ఆయిల్ ట్యాంకర్‌లతో కూడిన బీటీపీఎన్ రైలు స్థానికంగా ఉన్న ఆయిల్ గోదాములలో ఆయిల్ డంపింగ్ అయిన తర్వాత తిరిగి షంటింగ్, డిరైలింగ్ చేస్తున్న క్రమంలో రైలు పట్టాలు తప్పింది. అంతే కాకుండా రైలు ట్యాంకర్(బోగీ) చక్రాలు మధ్యలో ఊడిపోయాయి. ఇది గమణించి రైలును వెంటనే నిలిపి వేశారు. పట్టాలు తప్పిన గూడ్స్ రైలు మెయిన్‌లైన్‌లో లేకపోవడం వల్ల రైళ్ల రాకపోకలకు అంతరాయం కలగలేదని స్టేషన్ మేనేజర్ శ్రీనివాస్‌రావు వివరించారు. పూర్తిస్థాయి మరమ్మతుల అనంతరం రైలు సాయంత్రం అక్కడి నుంచి కదిలింది.