రాఘవేంద్రుడికి బంగారు పల్లకీ సేవ | golden pallkiseva for raghavendraswamy | Sakshi
Sakshi News home page

రాఘవేంద్రుడికి బంగారు పల్లకీ సేవ

Jun 29 2017 10:14 PM | Updated on Sep 5 2017 2:46 PM

రాఘవేంద్రుడికి బంగారు పల్లకీ సేవ

రాఘవేంద్రుడికి బంగారు పల్లకీ సేవ

శ్రీరాఘవేంద్ర స్వామి మఠంలో గురువారం బృందావన ప్రతిమను బంగారు పల్లకిలో ఊరేగించారు.

మంత్రాలయం :  శ్రీరాఘవేంద్ర స్వామి మఠంలో గురువారం బృందావన ప్రతిమను బంగారు పల్లకిలో ఊరేగించారు. ముందుగా శ్రీ రాఘవేంద్ర స్వామి మూలబృందావనానికి ప్రత్యేక పూజలు చేశారు. ఊంజలలో రజత బృందావన ప్రతిమను కొలువుంచి భక్తులతో సంకల్పం చేయించారు. అనంతరం పుష్పాలంకార బంగారు పల్లకీలో బృందావన ప్రతిమను మాడ వీధుల్లో ఊరేగించారు. పల్లకీ సేవ భక్తులకు ఎంతగానో ఆకట్టుకుంది. వేడుకల్లో ఏఏఓ మాధవ శెట్టి, మేనేజర్‌ శ్రీనివాస రావు, జోనల్‌ మేనేజర్‌ శ్రీపతి ఆచార్, ధార్మిక సహాయక అధికారి వ్యాసరాజాచార్‌ పాల్గొన్నారు. 
 
కొనసాగుతున్న హుండీ లెక్కింపు : శ్రీ రాఘవేంద్ర స్వామి మఠానికి సంబంధించి జూన్‌ నెల హుండీ లెక్కింపు కొనసాగుతోంది. బుధవారం రూ.42.03లక్షలు రాగా.. గురువారం రూ.51.99 లక్షలు సమకూరింది. రెండు రోజులకు గానూ మొత్తం రూ.94.02లక్షలు వచ్చినట్లు ఏఏఓ మాధవ శెట్టి, మేనేజర్‌ శ్రీనివాస రావు తెలిపారు. రెండురోజుల్లో హుండీ లెక్కింపు పూర్తి కావస్తోందన్నారు. 
 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement