జాతీయ స్విమ్మింగ్‌లో గుణశేఖర్‌కు స్వర్ణం | gold medal gunasekhar | Sakshi
Sakshi News home page

జాతీయ స్విమ్మింగ్‌లో గుణశేఖర్‌కు స్వర్ణం

Oct 21 2016 11:17 PM | Updated on Sep 4 2017 5:54 PM

స్టూడెంట్‌ ఒలింపిక్‌ అసోసియేష¯ŒS జాతీయ స్థాయి స్విమ్మింగ్‌ అండర్‌–19 పోటీల్లో జి.మామిడాడకు చెందిన కె.గుణశేఖర్‌ స్వర్ణ పతకం సాధించాడు. ఈ వివరాలు అసోసియేష¯ŒS జిల్లా కార్యదర్శి కె.రాజశేఖర్‌ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. గుణశేఖర్‌ స్థానిక డీఎల్‌ఆర్‌ డిగ్రీ కాలేజీలో డిగ్రీ ఫస్ట్‌ ఇయర్‌ చదువుతున్నాడు. అతడు ఈ నెల 13, 14, 15 తేదీల్లో గుజరాత్‌ రాష్ట్రం వడోదర ప్రాంతంలో జరిగిన జాతీయ స్థాయి స్విమ్మింగ్‌ పోట

జి.మామిడాడ(పెదపూడి) :
స్టూడెంట్‌ ఒలింపిక్‌ అసోసియేష¯ŒS జాతీయ స్థాయి స్విమ్మింగ్‌ అండర్‌–19 పోటీల్లో జి.మామిడాడకు చెందిన కె.గుణశేఖర్‌ స్వర్ణ పతకం సాధించాడు. ఈ వివరాలు అసోసియేష¯ŒS జిల్లా కార్యదర్శి కె.రాజశేఖర్‌ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. గుణశేఖర్‌ స్థానిక డీఎల్‌ఆర్‌ డిగ్రీ కాలేజీలో డిగ్రీ ఫస్ట్‌ ఇయర్‌ చదువుతున్నాడు. అతడు ఈ నెల 13, 14, 15 తేదీల్లో గుజరాత్‌ రాష్ట్రం వడోదర ప్రాంతంలో జరిగిన జాతీయ స్థాయి స్విమ్మింగ్‌ పోటీల్లో ఈ పతకం సాధించాడని తెలిపారు. సెప్టెంబర్‌ 9, 10, 11 తేదీల్లో నెల్లూరు జిల్లాలో జరిగిన రాష్ట్ర స్థాయి పోటీల్లో కూడా బంగారు పతకం సాధించాడన్నారు. గుణశేఖర్‌కు కళాశాల యాజమాన్యం, గ్రామ పెద్దలు, ప్రజాప్రతినిధులు అభినందనలు తెలిపారు.
 

Advertisement
 
Advertisement
Advertisement