కళ్లల్లో కారం నీళ్లు కొట్టి.. సరుడు దోపిడీ | gold chain theft | Sakshi
Sakshi News home page

కళ్లల్లో కారం నీళ్లు కొట్టి.. సరుడు దోపిడీ

Aug 29 2016 10:42 PM | Updated on Sep 4 2017 11:26 AM

గూడూరు : ట్యాంక్‌ శుభ్రం చేస్తానని చెప్పి వచ్చి ఓ మహిళ కళ్లల్లో కారం కలిపిన నీళ్లు కొట్టి 4 సవర్ల సరుడును పట్టపగలు దోచుకెళ్లిన సంఘటన స్థానిక సన్నత్‌నగర్‌లో సోమవారం చోటుచేసుకుంది.

గూడూరు : ట్యాంక్‌ శుభ్రం చేస్తానని చెప్పి వచ్చి ఓ మహిళ కళ్లల్లో కారం కలిపిన నీళ్లు కొట్టి 4 సవర్ల సరుడును పట్టపగలు దోచుకెళ్లిన సంఘటన  స్థానిక సన్నత్‌నగర్‌లో సోమవారం చోటుచేసుకుంది. బాధితుల వివరాల మేరకు.. పట్టణంలోని సన్న™Œ నగర్‌ ప్రాంతంలో టీచర్‌ వెంకటేశ్వర్లు కుటుంబం నివాసం ఉంటుంది. సోమవారం ఆయన  పాఠశాలకు వెళ్లాడు. ఇంటో ఆయన సతీమణి సుమతి ఒక్కటే ఉంది. మధ్యాహ్నం సమయంలో గుర్తుతెలియని వ్యక్తి వచ్చి ఇంటి తలుపు తట్టడంతో సుమతి తలుపు తీసింది. ఆ వ్యక్తి ట్యాంక్‌ క్లీన్‌ చేస్తానని చెప్పి మాట్లాడుతూ కారం కలిపిన నీటిని సుమతి కళ్లల్లో కొట్టి, ఆమె మెడలో ఉన్న నాలుగు సవర్ల సరుడును లాక్కెళ్లాడు. బాధితులు 1వ పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు సంఘటనా స్థలానికి వచ్చి పరిశీలించి కేసు నమోదు చేశారు. 
 

Advertisement
 
Advertisement
Advertisement