తీరానికి కొట్టుకొచ్చిన పంచలోహ విగ్రహం | godess statue in sea costal | Sakshi
Sakshi News home page

తీరానికి కొట్టుకొచ్చిన పంచలోహ విగ్రహం

Aug 21 2016 10:52 PM | Updated on Sep 4 2017 10:16 AM

తీరానికి కొట్టుకొచ్చిన పంచలోహ విగ్రహం

తీరానికి కొట్టుకొచ్చిన పంచలోహ విగ్రహం

గాదెలదిన్నె (విడవలూరు) : మండలంలోని రామతీర్థం సముద్ర తీరానికి అమ్మవారి పంచలోహ విగ్రహం కొట్టుకొచ్చిన సంఘటన ఆదివారం సాయంత్రం చోటు చేసుకుంది

 సీతాదేవి విగ్రహంగా అనుమానం
స్వాధీనం చేసుకున్న పోలీస్‌లు 
గాదెలదిన్నె (విడవలూరు) :  మండలంలోని రామతీర్థం సముద్ర తీరానికి అమ్మవారి పంచలోహ విగ్రహం కొట్టుకొచ్చిన సంఘటన ఆదివారం సాయంత్రం చోటు చేసుకుంది. మండలంలోని గాదెలదిన్నెకు చెందిన వెంకటేశ్వర్లు, శ్రీనివాసులు మరో ఇద్దరు స్నేహితులు ఆదివారం సముద్ర తీరానికి వెళ్లారు. అక్కడ ఈత కొడుతున్న సమయంలో వారికి గట్టున తెల్లని వస్తువు కనిపించింది. దాన్ని చూసి విగ్రహంగా భావించి గ్రామానికి తీసుకువచ్చి పెద్దలకు తెలియజేశారు. అది పంచలోహ విగ్రహంగా భావిస్తున్నారు. విగ్రహంపై ప్రతిమ సరిగా కనిపించడం లేదు. సీతాదేవిగా విగ్రహంగా భావిస్తున్నారు. ఈ విషయాన్ని విడవలూరు పోలీసుల దష్టికి తీసుకెళ్లడంతో ఆ విగ్రహాన్ని స్వాధీనం చేసుకున్నారు. 
 

Advertisement
 
Advertisement
Advertisement