గోదావరిలో తగ్గని వరద ఉధృతి | godavari flow still continuous | Sakshi
Sakshi News home page

గోదావరిలో తగ్గని వరద ఉధృతి

Sep 17 2016 10:28 PM | Updated on Sep 4 2017 1:53 PM

గోదావరిలో వరద ఉధృతి కొనసాగుతోంది. ధవళేశ్వరం ఆనకట్ట వద్ద శనివారం సాయంత్రం 6 గంటలకు నీటిమట్టం 10.40 అడుగులకు చేరింది. ఆనకట్ట నుంచి 4,01,182 క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి విడిచిపెడుతున్నారు. ఉభయగోదావరి జిల్లాల్లో డెల్టా కాలువలకు నీటి విడుదల కొద్దిమేర పెంచారు.

కొవ్వూరు: గోదావరిలో వరద ఉధృతి కొనసాగుతోంది. ధవళేశ్వరం ఆనకట్ట వద్ద శనివారం సాయంత్రం 6 గంటలకు నీటిమట్టం 10.40 అడుగులకు చేరింది. ఆనకట్ట నుంచి  4,01,182 క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి విడిచిపెడుతున్నారు. ఉభయగోదావరి జిల్లాల్లో డెల్టా కాలువలకు నీటి విడుదల కొద్దిమేర పెంచారు. శుక్రవారం 8,400 క్యూసెక్కులు విడిచిపెట్టిన అధికారులు శనివారం సాయంత్రం నుంచి 10,300 క్యూసెక్కులు వదులుతున్నారు. పశ్చిమ డెల్టా కాలువకు 6 వేల క్యూసెక్కుల నీరు విడుదల చేస్తున్నారు. శుక్రవారం కంటే వెయ్యి క్యూసెక్కుల నీటిని పెంచి విడుదల చేస్తున్నారు

Advertisement
 
Advertisement
Advertisement