నిప్పంటించుకుని బాలిక ఆత్మహత్య | girl suicide.. | Sakshi
Sakshi News home page

నిప్పంటించుకుని బాలిక ఆత్మహత్య

Aug 5 2016 7:38 AM | Updated on Sep 4 2017 7:50 AM

పట్టణంలోని రాం నగర్‌కు చెందిన సేగారి స్నేహ(12) ఒంటిపై కిరోసిన్‌ పోసుకుని నిప్పంటించుకుని ఆత్మహత్య చేసుకుంది.

కమలాపురం:
పట్టణంలోని రాం నగర్‌కు చెందిన సేగారి స్నేహ(12) ఒంటిపై కిరోసిన్‌ పోసుకుని నిప్పంటించుకుని ఆత్మహత్య చేసుకుంది. ఎస్‌ఐ శ్రీనివాసులరెడ్డి తెలిపిన సమాచారం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. సేగారి శ్యామల, సోమయ్యకు ఇద్దరు సంతానం. వారిలో స్నేహ తొలి సంతానం. స్థానిక బాలికల హైస్కూల్‌లో 8వ తరగతి చదువుతున్న ఆ బాలిక బుధవారం స్కూల్‌కు వెళ్లలేదు. దీంతో తల్లి శ్యామల మందలించింది. గురువారం ఉదయం ఉపాధి పనికి పోతున్న తల్లి.. ‘స్కూల్‌కు వెళ్లే.. లేక పోతే నీ కథ చెబుతా’ అని  మందలించింది. తండ్రి సోమయ్య ఆటో వృత్తిపై వెళ్లిపోయాడు.

స్నేహ స్కూల్‌కు వెళ్లలేదు. ఇంటికి వచ్చిన తర్వాత అమ్మ అరుస్తుందని భయపడిందో.. ఏమో.. తలుపులు వేసుకొని ఇంట్లో ఉన్న కిరోసిన్‌ ఒంటిపై పోసుకుని నిప్పటించుకొని ఆత్మహత్యకు పాల్పడింది. మంటలకు తట్టుకోలేక గట్టిగా కేకలు వేయడంతో ఇరుగు పొరుగు వారు వచ్చి తలుపులు పగులగొట్టారు. అప్పటికే 80 శాతం కాలిపోయింది. చికిత్స నిమిత్తం 108 వాహనంలో కడప రిమ్స్‌కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతున్నా పరిస్థితి విషమించడంతో మృతి చెందింది. మృతదేహాన్ని పోస్టుమార్టం చేసి తల్లిదండ్రులకు అప్పగిస్తామని ఎస్‌ఐ తెలిపారు. స్నేహ మృతి చెందడంతో తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు బోరున విలపించారు.

Advertisement
 
Advertisement
Advertisement