చిన్నారి సురక్షితం | girl safe in kadiri | Sakshi
Sakshi News home page

చిన్నారి సురక్షితం

Oct 14 2016 11:25 PM | Updated on Sep 4 2017 5:12 PM

చిన్నారి సురక్షితం

చిన్నారి సురక్షితం

కదిరి మునిసిపాలిటీ పరిధిలోని కుటాగుళ్లకు చెందిన వరాలు, ఆంజనేయులు దంపతుల ఐదేళ్ల కుమార్తె అనుష్క కిడ్నాప్‌ కేసును పోలీసులు 24 గంటల్లోనే ఛేదించారు.

– అనుష్క కిడ్నాప్‌ కేసును ఛేదించిన కదిరి పోలీసులు
కదిరి : కదిరి మునిసిపాలిటీ పరిధిలోని కుటాగుళ్లకు చెందిన వరాలు, ఆంజనేయులు దంపతుల ఐదేళ్ల కుమార్తె అనుష్క కిడ్నాప్‌ కేసును పోలీసులు 24 గంటల్లోనే ఛేదించారు. ఇందుకు సంబంధించిన వివరాలను జిల్లా ఎస్పీ రాజశేఖర్‌బాబు శుక్రవారం పట్టణ పోలీస్‌ స్టేషన్‌లో మీడియాకు వెల్లడించారు. ఒకప్పుడు కుటాగుళ్లలోనే కాపురముండి, ప్రస్తుతం జమ్మలమడుగులో ఉంటున్న నాగమణి తన కుమార్తె హేమలతతో కలిసి డబ్బు కోసం చిన్నారిని గురువారం తెల్లవారుజామున కిడ్నాప్‌ చేసింది. తర్వాత ఏం చేయాలో తెలియక ధర్మవరంలో ఉంటున్న అల్లుడు చిరంజీవి దగ్గరకు తీసుకెళ్లింది. ఈ చిన్నారి ఎవరని అతను ప్రశ్నించాడు. తనకు తెలిసిన వారి అమ్మాయి అని, వెంటబడగా తీసుకొచ్చామని నమ్మబలికింది.

కాగా.. ఈ కేసును సీరియస్‌గా తీసుకున్న  కదిరి డీఎస్పీ రామాంజనేయులు పట్టణ ఎఐ మధుసూదన్‌రెడ్డి నేతత్వంలో ప్రత్యేక బందాన్ని ఏర్పాటు చేశారు. చిన్నారి ధర్మవరంలో ఉందని తెలుసుకున్న ఈ బందం అక్కడికి వెళ్లింది. నిందితురాలు నాగమణి, ఆమె కుమార్తె, అల్లుణ్ని అదుపులోకి తీసుకుంది. చిన్నారిని సురక్షితంగా తీసుకొచ్చి తల్లిదండ్రులకు అప్పగించారు.

Advertisement
 
Advertisement
Advertisement