డెంగీతో బాలిక మృతి | girl dies of dengue | Sakshi
Sakshi News home page

డెంగీతో బాలిక మృతి

Oct 20 2016 11:10 PM | Updated on Sep 4 2017 5:48 PM

యరడికెర గ్రామానికి చెందిన సానియా (4) డెంగీతో గురువారం మృతి చెందింది.

బ్రహ్మసముద్రం : యరడికెర గ్రామానికి చెందిన సానియా (4) డెంగీతో గురువారం మృతి చెందింది. బాలిక తల్లిదండ్రులు జాఫర్, రమీజాబేగం తెలిపిన వివరాలు... నాలుగు రోజుల క్రితం  తీవ్ర జ్వరంతో భాధపడుతూ అస్వస్థతకు గురైన బాలికను, చికిత్స కోసం  అనంతపురంలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించారు. అక్కడ మూడు రోజుల చికిత్స అనంతరం డెంగీ వ్యాధిగా నిర్ధారించిన ఆస్పత్రి వైద్యులు పాపను వెంటనే జిల్లా ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లాలని సూచించడంతో అక్కడి నుంచి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ గురువారం సానియా మృతి చెందింది.

Advertisement
 
Advertisement
Advertisement