ప్రియుడులేని లోకంలో బతకలేక.. | girl commits suicide at godavarikhani | Sakshi
Sakshi News home page

ప్రియుడులేని లోకంలో బతకలేక..

Feb 17 2017 11:27 AM | Updated on Nov 6 2018 7:53 PM

ప్రియుడులేని లోకంలో బతకలేక.. - Sakshi

ప్రియుడులేని లోకంలో బతకలేక..

కళ్ల ముందే ప్రియుడు ఆత్మహత్య చేసుకోవడంతో.. మనస్తాపానికి గురైన ప్రియురాలు ఉరేసుకుంది.

గోదవరిఖని: గోదావరిఖనిలో విషాదం చోటుచేసుకుంది. తన కళ్ల ముందే ప్రియుడు ఆత్మహత్య చేసుకున్నాడని మనస్తాపానికి గురైన ప్రియురాలు ఉరి వేసుకొని బలవన్మరణానికి పాల్పడింది. వివరాలు..  స్థానిక శారదానగర్‌కు చెందిన బోడకుంట ప్రియాంక(24) ఎమ్మెస్సీ పూర్తి చేసి హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్‌ కంపెనీలో ఉద్యోగం చేస్తోంది. వీరి కుటుంబం గతంలో విఠల్‌నగర్‌లో ఉన్నప్పుడు ఇంటి పక్కనే ఉండే  ప్రవీణ్‌ గౌడ్‌తో పరిచయం ఏర్పడింది. పరిచయం కాస్తా ప్రేమగా మారింది.

ఉద్యోగరిత్య శ్రీశైలంలో ఉంటున్న ప్రవీణ్‌ గౌడ్‌ గత కొంతకాలంగా ప్రియాంకపై పెళ్లి చేసుకుందామని ఒత్తిడి చేస్తున్నాడు. దీనికి ఆమె నిరకరిస్తూ వస్తోంది.. ఇంట్లో తనకు ఇంకో సోదరి ఉందని ఆమె పెళ్లి జరిగిన అనంతరం కుటుంబ సభ్యలకు ప్రేమ విషయం చెబుతానని వాయిదా వేస్తూ వస్తోంది. ఈ క్రమంలో ఈ నెల 15న వీరిద్దరు ప్రవీణ్‌ ఇంట్లో కలిసి ఈ విషయంపై గొడవ పడ్డారు. కోపోద్రిక్తుడైన ప్రవీణ్‌ గదిలోకి వెళ్లి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.

ఏడేళ్లుగా ప్రేమిస్తున్న వ్యక్తి కళ్లముందే మృతిచెందడంతో.. కుంగిపోయిన ప్రియాంక.. గురువారం రాత్రి కుటుంబ సభ్యులు నిద్రస్తున్న​ సమయంలో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. క్షణ కాలంలో తీసుకున్న నిర్ణయాలు రెండు కుటుంబాల్లో తీరిని విషాదాన్ని నింపాయి. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement