లావుగా ఉన్నావని భార్యను కడతేర్చిన భర్త | Bengaluru woman Priyanka incident | Sakshi
Sakshi News home page

లావుగా ఉన్నావని భార్యను కడతేర్చిన భర్త

Jul 2 2026 7:47 AM | Updated on Jul 2 2026 11:04 AM

Bengaluru woman Priyanka incident

కర్ణాటక: చిన్న కారణంతో ఓ భర్త తన భార్య గొంతు నులిమి హత్య చేసి ఘటన ధార్వాడ జిల్లాలోని నవలగుంద తాలూకా ఉణసి గ్రామంలో చోటు చేసుంది. ప్రియాంక (29) హత్యకు గురైన మహిళ. భర్త బసవరాజ్‌ వడ్డర్‌(32) నిందితుడు. మృతురాలి తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు వివరాలు.. 2024లో ప్రియాంక, బసవరాజ్‌లకు పెళ్లయింది. పెళ్లైన నెల రోజుల నుంచి భర్త బసవరాజు సోదరుడు సిద్దరామేష్‌ తల్లిదండ్రులు సుభాష్, వేణవ్వ పుట్టింటి నుంచి బంగారం తీసుకురావాలని తమ కుమార్తెను వేధించారు. 

అంతేగాక నువ్వు చాలా లావుగా ఉన్నావు. భర్త వయస్సు కన్నా నీ వయస్సే పెద్దది. ఇలా అయితే గర్భిణివి కాలేవని మానసికంగా, శారీరకంగా హింసించారు. అంతేగాక ప్రియాంకపై అనుమానం పెట్టుకొని భర్త బసవరాజ్‌ తరచు ఘర్షణ పడుతూ ఆమె గొంతు నులిమి చంపాడని మృతురాలి తల్లి లక్ష్మి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. మృతురాలి భర్త బసవరాజ్‌తో పాటు నవలగుంద పోలీసులు నలుగురిపై కేసు నమోదు చేశారు. నిందితులను అరెస్ట్‌ చేసి విచారణ చేపట్టారు.  

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement