సాక్షి, హైదరాబాద్: నగరంలో చమురు అక్రమ, కృత్రిమ కొరత సృష్టిస్తే చర్యలు తప్పవని హైదరాబాద్ కలెక్టర్ డాక్టర్ ప్రియాంక అల హెచ్చరించారు. పెట్రోల్, డీజిల్ కొరత రాకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆమె ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ లభ్యత, నిల్వలు, సరఫరా పరిస్థితులపై ఏజెన్సీ నిర్వాహకులు, డి్రస్టిబ్యూటర్లతో సమీక్షించారు. అనంతరం మాట్లాడుతూ..
నీటి సరఫరా, ప్రభుత్వ వాహనాలు, అంబులెన్సులు, ఫైరింజిన్లకు ఇంధన కొరత లేకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సూచించారు. గ్యాస్ సిలిండర్ల సరఫరా విషయంలో బుకింగ్, రీఫిల్లింగ్ నిబంధనలను కచి్చతంగా అమలు చేయాలని ఆదేశించారు. ఒకే సిలిండర్ కలిగిన కుటుంబాలకు ప్రాధాన్యమివ్వాలన్నారు. పౌరులు వదంతులను నమ్మవద్దని, అధికారిక సమాచారాన్ని మాత్రమే ఆధారంగా తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. సమావేశంలో చీఫ్ రేషనింగ్ ఆఫీసర్ రాజిరెడ్డి, జిల్లా సివిల్ సప్లై అధికారి శ్రీనివాస్, సంక్షేమ అధికారులు జి.ఆశన్న, ప్రవీణ్ కుమార్, ఇలియాస్ అహ్మద్, ఆర్టీఓ పురుషోత్తమ రెడ్డి తదితరులు పాల్గొన్నారు


