తప్పుడు రిపోర్టుతో భయపెడుతున్నారు | ggh shugar test report false | Sakshi
Sakshi News home page

తప్పుడు రిపోర్టుతో భయపెడుతున్నారు

Jul 29 2016 8:45 AM | Updated on Sep 4 2017 6:46 AM

తప్పుడు రిపోర్టుతో భయపెడుతున్నారు

తప్పుడు రిపోర్టుతో భయపెడుతున్నారు

గుంటూరు మెడికల్‌ : ఏడేళ్ల బాలుడికి అధిక మోతాదులో షుగరు ఉందంటూ తప్పుడు రిపోర్టు ఇచ్చి తమను భయాందోళనకు గురి చేశారని, సదరు సిబ్బందిపై చర్యలు తీసుకోవాలంటూ శుక్రవారం బాలుడి తండ్రి జీజీహెచ్‌ అధికారులకు ఫిర్యాదు చేశాడు.

గుంటూరు: ఏడేళ్ల బాలుడికి అధిక మోతాదులో షుగరు ఉందంటూ తప్పుడు రిపోర్టు ఇచ్చి తమను భయాందోళనకు గురి చేశారని, సదరు సిబ్బందిపై చర్యలు తీసుకోవాలంటూ శుక్రవారం బాలుడి తండ్రి జీజీహెచ్‌ అధికారులకు ఫిర్యాదు చేశాడు. స్థానిక పాతగుంటూరు యాదవబజారుకు చెందిన ఏడేళ్ల కీళ్ల సాయితేజకు మూత్రంలో రక్తం వస్తుండడంతో చికిత్స కోసం ఈనెల 21న జీజీహెచ్‌కు వచ్చారు. డాక్టర్‌ బాలుడిని పరీక్ష చేసి వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేయించాలని సూచించారు.

దీంతో అవుట్‌ పేషెంట్‌ విభాగం 24వ నంబరు గదిలోని రక్త పరీక్షల కేంద్రంలో షుగర్‌ పరీక్ష చేయించారు. బాలుడికి షుగర్‌ 334 ఉన్నట్లు రిపోర్టు ఇవ్వడంతో కంగారు పడిపోయి తదుపరి ప్రైవేటు ల్యాబ్‌లో రెండు పర్యాయాలు పరీక్ష చేయిస్తే 98 నుంచి 119 లోపు ఉన్నట్లు రిపోర్టులు వచ్చాయని బాలుడి తండ్రి హర్ష తెలిపారు. తమకు రిపోర్టులు తప్పుగా ఇచ్చిన వారిపై చర్యలు తీసుకుని, ఇలాంటి సంఘటనలు పునరావతం కాకుండా చూడాలని కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement