వైఎస్సార్సీపీని బలోపేతం చేయండి | Gattu srikanth reddy about ysrcp | Sakshi
Sakshi News home page

వైఎస్సార్సీపీని బలోపేతం చేయండి

Nov 22 2016 1:32 AM | Updated on May 25 2018 9:20 PM

వైఎస్సార్సీపీని బలోపేతం చేయండి - Sakshi

వైఎస్సార్సీపీని బలోపేతం చేయండి

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని ఆదిలాబాద్ జిల్లాలో బలోపేతం చేయూలని ఆ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్‌రెడ్డి అన్నారు.

రాష్ట్ర అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్‌రెడ్డి
పార్టీలో సీనియర్ నాయకుడు జిలానీ చేరిక

ఆదిలాబాద్ రిమ్స్/నేరడిగొండ : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని ఆదిలాబాద్ జిల్లాలో బలోపేతం చేయూలని ఆ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్‌రెడ్డి అన్నారు. ఆదిలాబాద్ పట్టణానికి చెందిన మైనార్టీ సీనియర్ నాయకుడు షేక్ జిలానీ సోమవారం హైదరాబాద్‌లోని పార్టీ కార్యాలయంలో గట్టు శ్రీకాంత్‌రెడ్డి సమక్షంలో పార్టీలో చేరారు. ఈ సందర్భంగా శ్రీకాంత్‌రెడ్డి ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

శ్రీకాంత్‌రెడ్డి మాట్లాడుతూ జిల్లాలో పార్టీ పటిష్టతకు కృషి చేయూలని తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు బెజ్జంకి అనిల్‌కుమార్, జిల్లా అధికార ప్రతినిధి తడపత్రి తిలక్‌రావు, బోథ్ నియోజకవర్గ నాయకులు జాదవ్ ప్రవీణ్‌నాయక్, నేరడిగొండ, ఇచ్చోడ మండలాల కన్వీనర్‌లు రాజశేఖరరెడ్డి, షేక్ సాదుల్లా, యువజన నాయకుడు లింగం, తదితరులు పాల్గొన్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement