తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరంలో విజిలెన్స్ అధికారులు గురువారం తనిఖీలు నిర్వహించారు.
కాకినాడ : తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరంలో విజిలెన్స్ అధికారులు గురువారం తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా 600 కేజీల గంజాయిని వారు స్వాధీనం చేసుకున్నారు. అందుకు సంబంధించి ఒకరిని అరెస్టే చేశారు. అలాగే లారీని సీజ్ చేశారు. భారీ ఎత్తున గంజాయి అక్రమ రవాణా జరుగుతుందని ఆగంతకుడు విజిలెన్స్ అధికారులకు సమాచారం అందించారు. దీంతో విజిలెన్స్ అధికారులు తనిఖీలు నిర్వహించారు.

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
