తిరుమలలో ఉగ్రవాదుల కదలికలపై ఆరా : డీఐజీ | Frisking in tirumala, says anantapur DIG Satyanarayana | Sakshi
Sakshi News home page

తిరుమలలో ఉగ్రవాదుల కదలికలపై ఆరా : డీఐజీ

Dec 30 2015 8:04 PM | Updated on Jun 1 2018 8:39 PM

తిరుమలలో ఉగ్రవాదుల కదలికలపై ఆరా తీస్తున్నట్లు అనంతపురం రేంజ్ డీఐజీ సత్యనారాయణ తెలిపారు.

అనంతపురం : తిరుమలలో ఉగ్రవాదుల కదలికలపై ఆరా తీస్తున్నట్లు అనంతపురం రేంజ్ డీఐజీ సత్యనారాయణ తెలిపారు. బుధవారం అనంతపురంలో డీఐజీ సత్యనారాయణ మాట్లాడుతూ... ఉత్తరప్రదేశ్, బిహార్, మధ్యప్రదేశ్ నుంచి వచ్చి... తిరుమల పరిసర ప్రాంతాల్లో అద్దెకుంటున్న వారి వివరాలు సేకరించామని చెప్పారు.

సదరు వ్యక్తులపై ఆయా రాష్ట్రాల్లో  నేరచరిత్రపై సమాచారాన్ని సేకరిస్తున్నామని చెప్పారు. అలాగే తిరుపతి రైల్వేస్టేషన్లో అనుమానాస్పదంగా ఉన్న వ్యక్తి వివరాలను కూడా సేకరిస్తున్నామని డీఐజీ సత్యనారాయణ వివరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement