మైనర్లకు ఉచిత న్యాయ సహాయం | free law help for minors | Sakshi
Sakshi News home page

మైనర్లకు ఉచిత న్యాయ సహాయం

Feb 17 2017 11:26 PM | Updated on Sep 5 2017 3:57 AM

మైనర్లకు ఉచిత న్యాయ సహాయం

మైనర్లకు ఉచిత న్యాయ సహాయం

మైనర్‌ చిన్నారులకు ఉచిత న్యాయ సహాయం అందిస్తామని జిల్లా లోక్‌ అదాలత్‌ జడ్జి ఎంఏ సోమశేఖర్‌ తెలిపారు.

– లోక్‌ అదాలత్‌ జడ్జి ఎంఏ సోమశేఖర్‌
 
కర్నూలు(అర్బన్‌): మైనర్‌ చిన్నారులకు ఉచిత న్యాయ సహాయం అందిస్తామని జిల్లా లోక్‌ అదాలత్‌ జడ్జి ఎంఏ సోమశేఖర్‌ తెలిపారు. శుక్రవారం స్థానిక సీ క్యాంప్‌లోని మున్సిపల్‌ హైస్కూల్‌లో డా.జె. యధుభూషణ్‌రెడ్డి ఆధ్వర్యంలో విద్యార్థులకు స్వైన్‌ఫ్లూ నివారణకు ఉచిత హోమియా మందులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి  అతిథిగా హాజరైన సోమశేఖర్‌ మాట్లాడుతూ విద్యార్థులు, స్కూల్‌ టీచర్లు హోమియో మందులను తప్పక వాడాలన్నారు. ప్రతి ఒక్కరు ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద​‍్ధ తీసుకోవాలని సూచించారు. న్యాయ పరంగా ప్రతి ఒక్కరు చట్టాలపై అవగాహనను పెంచుకోవాలన్నారు.
 
పిల్లలతో పాటు మహిళలకు కూడా ఉచితంగా న్యాయ సహాయం అందిస్తామన్నారు. బాలల హక్కులు, అనాథ పిల్లలకు ఎన్‌జీఓ ఆర్గనైజేషన్స్‌ అందిస్తున్న సేవలను వివరించారు. ఈ నేపథ్యంలోనే హాజరైన విద్యార్థులు, టీచర్లకు హోమియో మందులను అందించారు. కార్యక్రమంలో న్యాయవాదులు బి. ఆదినారాయణరెడ్డి, పి. నిర్మల, ఎంఏ తిరుపతయ్య, శివసుదర్శన్, స్కూల్‌ ప్రధానోపాధ్యాయులు వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement