నలుగురు అంతర్జాతీయ స్మగ్లర్లు అరెస్ట్‌ | Four international smugglers arrested | Sakshi
Sakshi News home page

నలుగురు అంతర్జాతీయ స్మగ్లర్లు అరెస్ట్‌

Jul 26 2016 11:15 PM | Updated on Aug 20 2018 4:27 PM

నలుగురు అంతర్జాతీయ స్మగ్లర్లు అరెస్ట్‌ - Sakshi

నలుగురు అంతర్జాతీయ స్మగ్లర్లు అరెస్ట్‌

పేరు మోసిన నలుగురు అంతర్జాతీయ స్మగ్లర్లను అరెస్టు చేసినట్లు వైఎస్సార్‌ జిల్లా రాజంపేట డీఎస్పీ ఏ.రాజేంద్ర తెలిపారు. మంగళవారం స్థానిక డీఎస్పీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడరు

రాజంపేట రూరల్‌:
పేరు మోసిన నలుగురు అంతర్జాతీయ స్మగ్లర్లను అరెస్టు చేసినట్లు వైఎస్సార్‌ జిల్లా రాజంపేట డీఎస్పీ ఏ.రాజేంద్ర తెలిపారు. మంగళవారం స్థానిక డీఎస్పీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ రైల్వేకోడూరు సమీపంలోని మాధవరంపోడు వద్ద రైల్వేకోడూరు సీఐ రసూల్‌సాహెబ్‌ వాహనాలు తనిఖీ చేస్తుండగా ఆ సమయంలో ఓ కారు వాగేటికోన వైపు నుంచి వచ్చిందన్నారు. వాహనాన్ని ఆపి తనిఖీ చేయగా అందులోని నలుగురు వ్యక్తులు పారిపోయేందుకు ప్రయత్నించారన్నారు. వారిలో ఇద్దరు వ్యక్తులు చైనాకు చెందిన చన్‌చంగ్‌డబ్ల్యూయూ, చన్‌చంగాయ్‌గా గుర్తించామన్నారు. మిగిలిన ఇద్దరిలో ఒకరు మోస్ట్‌ వాంటెడ్‌ స్మగ్లర్‌ అనుచరుడైన తమిళనాడుకు చెందిన డి.పద్మనాభన్‌గా గుర్తించామన్నారు. అమీర్‌హాజా అనే వ్యక్తి డిప్యూటీ డైరెక్టర్‌గా గతంలో అటవీశాఖలో విధులు నిర్వర్తించారన్నారు. వీరందరూ ఒక ముఠాగా ఏర్పడి తొమ్మిది ఎర్రచందనం దుంగలను కారులో తరలిస్తుండగా పట్టుకున్నామన్నారు. కారును, ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నామన్నారు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement