నాలుగిళ్లలో చోరీ | four houses theft | Sakshi
Sakshi News home page

నాలుగిళ్లలో చోరీ

Jul 23 2016 9:50 PM | Updated on Sep 4 2017 5:54 AM

నాలుగిళ్లలో చోరీ జరిగిన సంఘటన పట్టణంలో శుక్రవారం రాత్రి జరిగింది.

 రామాయంపేట: నాలుగిళ్లలో చోరీ జరిగిన సంఘటన పట్టణంలో శుక్రవారం రాత్రి జరిగింది. రామాయంపేట పోలీసుల కథనం మేరకు పట్టణంలోని వడ్లపాండు ఇంట్లోంచి అరతులం బంగారం, పది తులాల వెండి ఆభరణాలు, యాదగిరి అనే వ్యక్తి ఇంట్లోంచి రూ.20వేల నగదు, ఐదు తులాల వెండి ఆభరణాలు, ప్రభాకర్‌ అనే వ్యక్తి ఇంట్లోంచి 15తులాల వెండి ఆభరణాలు, లంబాడి గంగమ్మ ఇంట్లోంచి 20 తులాల వెండి ఆభరణాలు, అరతులం బంగారు ఆభరాణాలు,  రూ. 3వేల నగదు  ఎత్తుకెళ్లారు.

కాగా రాజు, జయమ్మ అనే వ్యక్తుల ఇళ్ల తాళాలు పగులు గొట్టినప్పటికీ వారింట్లో ఏమీ ఎత్తుకెళ్లలేదని తెలిపారు. మరో రెండు బైక్‌లు ఎత్తుకెళ్లిన దుండగులు గ్రామశివారులో వదిలి వెళ్లారు. దొంగలు మొత్తం రూ.23 వేల నగదు, 50 తులాల వెండి ఆభరణాలు,    తులం బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లారు. ఈ మేరకు రామాయంపేట ఎస్‌ఐ నాగార్జునగౌడ్‌ కేసు దర్యాప్తు చేస్తున్నారు.

 

Advertisement
 
Advertisement
Advertisement