ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి విజయవాడ శివారు రామవరప్పాడులో ఆకాశం నుంచి చేపలు రాలిపడ్డాయి.
విజయవాడ: ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి విజయవాడ శివారు రామవరప్పాడులో ఆకాశం నుంచి చేపలు రాలిపడ్డాయి. పిన్నమనేని హైట్ అపార్టుమెంట్ సమీపంలో ఈ సంఘటన చోటుచేసుకుంది. బుధవారం ఉదయం నిద్ర లేచేసరికి బతికే ఉన్న చిన్న చిన్న చేపలు పరిసరాల్లో పడి ఉన్నాయని స్థానికులు తెలిపారు. రాత్రి కురిసిన వర్షానికి చేపలు పడి ఉంటాయని భావిస్తున్నారు. స్థానికులు వాటిని ఏరుకున్నారు. గతంలోనూ కృష్ణాజిల్లాలో ఆకాశం నుంచి చేపలు రాలిపడిన విషయం తెలిసిందే.