ట్రాన్స్ పోర్ట్ గోడౌన్ లో అగ్నిప్రమాదం | fire breaksout in transport godown | Sakshi
Sakshi News home page

ట్రాన్స్ పోర్ట్ గోడౌన్ లో అగ్నిప్రమాదం

Nov 24 2016 8:27 AM | Updated on Sep 5 2018 9:47 PM

చీరాలలోని దీపక్ ట్రాన్స్ పోర్టు గోడౌన్ లో గురువారం తెల్లవారుజామున అగ్నిప్రమాదం చోటుచేసుకుంది.

ప్రకాశం: ట్రాన్స్‌పోర్ట్ గొడౌన్‌లో మంటలు చెలరేగడంతో.. కోట్ల రూపాయల విలువైన వస్తువులు అగ్నికి ఆహుతయ్యాయి. ప్రకాశం జిల్లా చీరాల ముంతవారికూడలిలోని దీపక్ ట్రాన్స్‌పోర్ట్ గొడౌన్‌లో గురువారం ఉదయం ప్రమాదవశాత్తు అగ్నిప్రమాదం సంభవించింది. దీంతో గొడౌన్‌లో ఉన్న దుస్తువుల కాటన్‌లు కాలి బూడిదయ్యాయి. విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని రెండు ఫైరింజన్లతో మంటలు ఆర్పుతున్నారు. ఈ ప్రమాదంలో కోట్ల రూపాయల ఆస్తి నష్టం వాటిల్లినట్లు సమాచారం.

 

Advertisement
 
Advertisement
Advertisement