తణుకు మండలం తేతలి ఇండస్ట్రియల్ ఏరియాలో గురువారం అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంతో పేపర్ ప్లేట్స్ తయారీ పరిశ్రమలో మంటలు...
పేపర్ ప్లేట్స్ పరిశ్రమలో మంటలు
May 26 2017 1:59 AM | Updated on Sep 5 2018 9:47 PM
తణుకు: తణుకు మండలం తేతలి ఇండస్ట్రియల్ ఏరియాలో గురువారం అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంతో పేపర్ ప్లేట్స్ తయారీ పరిశ్రమలో మంటలు వ్యాపిం చాయి. గురువారం సాయంత్రం పరిశ్రమలో పనిముగించుకుని కార్మికులు వెళ్లిన తర్వాత గోదాము నుంచి మంటలు ఎగసిపడ్డాయి. స్థానికులు గుర్తించి తణుకు అగ్నిమాపక శాఖ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. అప్పటికే మంటలు పెద్ద ఎత్తున వ్యాపించాయి. ఫైర్ సిబ్బంది మంటలను అదుపుచేశారు. సుమారు రూ.2 లక్షల ఆస్తినష్టం వాటిల్లినట్టు బాధితులు చెబుతున్నారు. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా ప్రమాదం జరిగినట్టు భావిస్తున్నారు.
Advertisement


