మండలంలో బుధవారం నిత్యావసర సరుకుల పంపిణీకి బయోమెట్రిక్ మిషన్లు ఓపెన్ చేయని ఎనిమిది మంది చౌకదుకాణాల డీలర్లకు ఒక్కొక్కరికి రూ.వెయ్యి చొప్పున జరిమానా విధించినట్లు కదిరి ఆర్‌డీఓ వెంకటేశు తెలిపారు.
నల్లమాడ (పుట్టపర్తి) : మండలంలో బుధవారం నిత్యావసర సరుకుల పంపిణీకి బయోమెట్రిక్ మిషన్లు ఓపెన్ చేయని ఎనిమిది మంది చౌకదుకాణాల డీలర్లకు ఒక్కొక్కరికి రూ.వెయ్యి చొప్పున జరిమానా విధించినట్లు కదిరి ఆర్‌డీఓ వెంకటేశు తెలిపారు. నల్లమాడ, కుటాలపల్లి, చెరువువాండ్లపల్లి, సీ బడవాండ్లపల్లి, చారుపల్లి, కొండకిందతండా, వంకరకుంట గ్రామాల్లోని 3, 6, 23, 24, 30, 35, 36, 38 షాపు నంబర్ల డీలర్లకు జరిమానా విధించినట్లు చెప్పారు.
ఇకముందు కూడా మిషన్లు ఓపెన్ చేయకపోతే రోజుకు రూ. వెయ్యి చొప్పున జరిమానా పెంచుతామని ఆర్‌డీఓ హెచ్చరించారు. సాంకేతిక లోపం కారణంగా క్యాస్‌లెస్ కింద మిషన్లు ఓపెన్ కాలేదన్న డీలర్ల వాదనను ఆర్‌డీఓ దృష్టికి తీసుకెళ్లగా క్యాస్‌లెస్ కింద మిషన్లు ఓపెన్ కానిపక్షంలో క్యాస్ తీసుకొని సరుకులు పంపిణీ చేయాలని తాము ఆదేశించామన్నారు.