ఆదుకున్న ఔదార్యం | financial help with patient | Sakshi
Sakshi News home page

ఆదుకున్న ఔదార్యం

Feb 14 2017 10:01 PM | Updated on Oct 2 2018 5:51 PM

కిడ్నీని దానం చేసి భర్త ప్రాణాలను నిలబెట్టుకోవడానికి ఆమె చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. భర్త చనిపోవడంతో రోడ్డున పడ్డ కుటుంబాన్ని ప్రవాసాంధ్రుడు డాక్టర్‌ వేగేశ్న వెంకట రామకృష్ణంరాజు ఆదుకున్నారు. రావులపాలెం మండలం పొడగట్లపల్లికి చెందిన సాగి

  • రోడ్డున పడ్డ కుటుంబానికి హెల్పింగ్‌ హ్యాండ్స్‌ చేయూత
  • ఆత్రేయపురం (కొత్తపేట) :
    కిడ్నీని దానం చేసి భర్త ప్రాణాలను నిలబెట్టుకోవడానికి ఆమె చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. భర్త చనిపోవడంతో రోడ్డున పడ్డ కుటుంబాన్ని ప్రవాసాంధ్రుడు డాక్టర్‌ వేగేశ్న వెంకట రామకృష్ణంరాజు ఆదుకున్నారు. రావులపాలెం మండలం పొడగట్లపల్లికి చెందిన సాగి శ్రీనివాసరాజుకు ఇటీవల కిడ్నీలు దెబ్బతినడంతో తీవ్ర అనారోగ్యానికి గురయ్యాడు. వైద్యానికి అయ్యే ఖర్చులు భరించలేని పరిస్థితుల్లో ఉన్న అతనికి పలు స్వచ్చంద సంస్థలు చేయూతను అందించాయి. ముఖ్యమంత్రి సహాయ నిధి, క్షత్రియ ఫౌండేషన్, వసుధ ఫౌండేష¯ŒS వైద్యం నిమిత్తం రూ.7లక్షల సాయం అందించాయి. భార్య సునీత తన కిడ్నీని ఇచ్చినప్పటికీ భర్తను బతికించుకోలేక పోవడంతో కుటుంబానికి కోలుకోలేని దెబ్బతగిలింది. ఈ పరిస్థితిలో ఆత్రేయపురానికి చెందిన ప్రవాసాంధ్రుడు డాక్టర్‌ వేగేశ్న చారిటబుల్‌ ట్రస్టు అధినేత వేగేశ్న వెంకట రామకృష్ణంరాజు వైద్యం నిమిత్తం రూ.40 వేలు హెల్పింగ్‌ హ్యాండ్‌్సకు అందించి ఔదార్యాన్ని చాటుకున్నారు. దీనికితోడు హెల్పింగ్‌ హ్యాండ్స్‌ స్వచ్ఛంద సంస్థ ద్వారా ఆ కుటుంబాన్ని అదుకోవడానికి రూ.2.86 లక్షల చెక్కును మంగళవారం అమలాపురం కిమ్స్‌ ఆసుపత్రి ఆవరణలో జరిగిన ఒక కార్యక్రమంలో మృతుడు భార్య సునీతకు అందజేశారు. ఈ కార్యక్రమంలో క్షత్రియ హెల్పింగ్‌ హ్యాండ్స్‌ ప్రతినిధి పెన్మెత్స ఫణీంద్రకుమార్‌ (ఆమెరికా) కోనసీమ క్షత్రియ సేవా సమితి ప్రెసిడెంట్‌ డీఎస్‌ఎ¯ŒSరాజు, ఉపాధ్యక్షుడు కేవీ రామరాజు, ట్రెజరర్‌ ఎం.రంగరాజు పాల్గొన్నారు. 
     
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement