కిష్టంపేటలో ప్రబలుతున్న జ్వరాలు | fevers rased at kishtampeta | Sakshi
Sakshi News home page

కిష్టంపేటలో ప్రబలుతున్న జ్వరాలు

Jul 20 2016 10:25 PM | Updated on Jun 13 2018 8:02 PM

గత వారం రోజులుగా మండలంలోని కిష్టంపేట గ్రామంలో జ్వరాలు ప్రబలుతున్నాయి. ఇప్పటికే చాలా మంది జ్వరాలు ప్రబలి మంచం పట్టారు. గ్రామానికి చెందిన భైరి శాంత, గజ్జెల లస్మాగౌడ్, సీతక్క, లక్ష్మి, రమ, దుర్గం శంకర్, కుంభం లక్ష్మి, ఎన్నం పుల్లయ్య, రామస్వామిలతో పాటు మరో కొంత మంది జ్వరాలతో బాధపడుతున్నారు.

చెన్నూర్‌ రూరల్‌ : గత వారం రోజులుగా మండలంలోని కిష్టంపేట గ్రామంలో జ్వరాలు ప్రబలుతున్నాయి. ఇప్పటికే చాలా మంది జ్వరాలు ప్రబలి మంచం పట్టారు. గ్రామానికి చెందిన భైరి శాంత, గజ్జెల లస్మాగౌడ్, సీతక్క, లక్ష్మి, రమ, దుర్గం శంకర్, కుంభం లక్ష్మి, ఎన్నం పుల్లయ్య, రామస్వామిలతో పాటు మరో కొంత మంది జ్వరాలతో బాధపడుతున్నారు. జ్వరాలు సోకిన వారు  కొందరు చెన్నూర్, మంచిర్యాల ప్రయివేటు ఆసుపత్రులకు వెళ్లి చికిత్సలు పొందినా తగ్గడం లేదని వాపోతున్నారు. కొంతరు స్థా«నిక ఆర్‌ఎంపీల వద్ద చికిత్సలు పొందుతున్నారు. సంబంధిత అధికారులు పట్టించుకొని గ్రామంలో వైద్య శిబిరం ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement