కుమారుడు సహా తండ్రి ఆత్మహత్య | father and son suicide issue | Sakshi
Sakshi News home page

కుమారుడు సహా తండ్రి ఆత్మహత్య

Nov 20 2016 12:18 AM | Updated on Aug 16 2018 4:21 PM

మొదటి భార్యతో విడాకులు, రెండో భార్యతో నిత్యం గొడవలు భరించలేని ఓ వ్యక్తి తన ఏడేళ్ల కుమారుడికి ఉరి వేసి తాను ఆత్మహత్య చేసుకున్న సంఘటన బెంగళూరు వైట్‌ఫీల్డ్‌ సమీపంలోని తూబరహళ్లిలో శనివారం చోటుచేసుకుంది. మృతులను ఆంధ్రప్రదేశ్‌లోని

కృష్ణరాజపురం : 
మొదటి భార్యతో విడాకులు, రెండో భార్యతో నిత్యం గొడవలు భరించలేని ఓ వ్యక్తి తన ఏడేళ్ల కుమారుడికి ఉరి వేసి తాను ఆత్మహత్య చేసుకున్న సంఘటన బెంగళూరు వైట్‌ఫీల్డ్‌ సమీపంలోని తూబరహళ్లిలో శనివారం చోటుచేసుకుంది. మృతులను ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడ సమీపంలోని జగన్నాథపురంలోని మహాలక్షి్మనగర్‌కు చెందిన మాతురాజు (28), అతని కుమారుడు లీలా మనోహర్‌ (7)గా పోలీసులు గుర్తించారు. వివరాలిలా ఉన్నాయి.. కార్పెంటర్‌గా పనిచేస్తున్న మాతురాజు తూబరహళ్లిలో నివాసముంటున్న తన బావ బాలాజీ ఇంటిలోనే ఉంటున్నాడు. మాతురాజుకు మొదటి భార్య ద్వారా ఒక కుమార్తె, ఒక కుమారుడు ఉన్నాడు. దంపతులు ఈ మధ్య విడాకులు తీసుకున్నారు. కుమార్తె తల్లి వద్ద ఉండగా కుమారుడిని తన వద్దనే ఉంచుకున్నాడు. ఇదిలా ఉండగా ఆరు నెలల క్రితం కాకినాడకు చెందిన లోవా అనే మహిళను మాతురాజు రెండో వివాహం చేసుకున్నాడు. ఇటీవల వారి మధ్య గొడవలు మొదలయ్యాయి. జీవితంపై విరక్తి చెందిన మాతురాజు ఆరోగ్యం కూడా సహకరించకపోవడంతో దీంతో శనివారం ఉదయం తాను ఉంటున్న గదిలో చీరతో మొదటి కుమారుడికి ఉరి వేసి అనంతరం తాను కూడా ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఇది గమనించిన మాతురాజు అక్క, బావ స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement