breaking news
bengalor
-
పని ఒత్తిడి తట్టుకోలేక ఎవ్వరికీ చెప్పకుండా, ఎక్కడికో వెళ్లిపోయి..
బెంగళూరు: కర్ణాటక గ్రామీణ మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థలో పనిచేస్తున్న ఇంజినీర్ పర్విజ్ ధార్వాడ్ అదృశ్యమయ్యారు. నిధుల కొరత, కాంట్రాక్టర్ల నుంచి చెల్లింపుల కోసం ఒత్తిడి ఎదురవుతోందని పేర్కొంటూ ఆయన సంస్థ మేనేజింగ్ డైరెక్టర్‌కు లేఖ రాసినట్లు అధికారులు తెలిపారు. లేఖలో తన వ్యక్తిగత జీవితం, మానసిక స్థితిపై ఈ పరిస్థితి ప్రభావం చూపుతోందని ఆయన ఆందోళన వ్యక్తం చేసినట్లు సమాచారం.గదగ్ ఉపవిభాగంలో కర్ణాటక గ్రామీణ మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ సహాయ కార్యనిర్వహణ ఇంజినీర్‌గా పనిచేస్తున్న పర్విజ్ సెప్టెంబర్ 12న బెంగళూరులోని సంస్థ మేనేజింగ్ డైరెక్టర్‌కు లేఖ రాసినట్లు సమాచారం. గదగ్ ప్రాంతంలో పలు అభివృద్ధి పనులకు నిధుల కొరత ఉందని అందులో పేర్కొన్నారు. పూర్తయిన కొన్ని పనులకు కూడా నిధులు లేక చెల్లింపులు చేయలేకపోతున్నామని, బకాయిల కోసం కాంట్రాక్టర్లు, టీమ్ లీడర్ల నుంచి ఒత్తిడి వస్తోందని ఆయన లేఖలో వివరించారు.సెప్టెంబర్ 13న బెంగళూరులో సమావేశం ఉందని చెప్పి పర్విజ్ అక్కడికి బయలుదేరారు. అప్పటి నుంచి ఆయన కనిపించలేదు. సెప్టెంబర్ 16న గదగ్‌లోని బేటగేరి పోలీస్‌స్టేషన్‌లో అదృశ్యమైన వ్యక్తి కేసు నమోదైంది. ఆయన చివరి ఆచూకీ ఆంధ్రప్రదేశ్‌లో గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. పర్విజ్ కోసం 5 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గాలింపు చేపట్టారు.రూ.6 కోట్ల నిధులు కోరినా విడుదల కాలేదు లేఖలో సుమారు రూ.6 కోట్ల నిధులు కోరినా అవి విడుదల కాలేదని పేర్కొన్నట్లు సమాచారం. కొన్ని పనులకు కేటాయించిన సుమారు రూ.2 కోట్ల నిధులు సంస్థ ప్రధాన కార్యాలయంలో అందుబాటులో ఉన్నాయని కూడా అందులో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. చెల్లింపుల విషయంలో ప్రతిరోజూ వేధింపులు ఎదురవుతున్నాయని, కొందరు తన ఇంటికి వచ్చి మాట్లాడటంతో పాటు కార్యాలయంలోనూ తనపై అరుస్తున్నారని పర్విజ్ ఆరోపించారు.లేఖలో తన జీవితాన్ని ముగించుకోవాలనే ఉద్దేశాన్ని సూచించే వ్యాఖ్యలు ఉన్నాయని, కుటుంబ సభ్యులను క్షమించాలని కోరినట్లు కూడా సమాచారం. తన పరిస్థితికి ఎవరినీ బాధ్యులను చేయవద్దని పేర్కొన్నారు. గదగ్ ఉపవిభాగంలోని నిధుల సమస్యను పరిష్కరించి, మరో సహాయ కార్యనిర్వహణ ఇంజినీర్‌ను నియమించాలని ఆయన కోరినట్లు సమాచారం. తన కుటుంబ సభ్యులను వేధించవద్దని కూడా విజ్ఞప్తి చేసినట్లు తెలుస్తోంది.పర్విజ్ గతంలోనూ 2024లో ఇలాగే అదృశ్యమైనట్లు పోలీసులు తెలిపారు. అప్పుడు 5 రోజుల తర్వాత గోవాలో ఆయన ఆచూకీ లభించింది. ప్రస్తుతం ఆయన కోసం గాలింపు కొనసాగుతోంది. లేఖలో ఆత్మహత్యకు సంబంధించిన ప్రస్తావనలు ఉండటంతో కుటుంబ సభ్యుల్లో ఆందోళన నెలకొంది. ఆయన అదృశ్యానికి దారితీసిన పరిస్థితులపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
కుమారుడు సహా తండ్రి ఆత్మహత్య
కృష్ణరాజపురం : మొదటి భార్యతో విడాకులు, రెండో భార్యతో నిత్యం గొడవలు భరించలేని ఓ వ్యక్తి తన ఏడేళ్ల కుమారుడికి ఉరి వేసి తాను ఆత్మహత్య చేసుకున్న సంఘటన బెంగళూరు వైట్‌ఫీల్డ్ సమీపంలోని తూబరహళ్లిలో శనివారం చోటుచేసుకుంది. మృతులను ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడ సమీపంలోని జగన్నాథపురంలోని మహాలక్షి్మనగర్కు చెందిన మాతురాజు (28), అతని కుమారుడు లీలా మనోహర్ (7)గా పోలీసులు గుర్తించారు. వివరాలిలా ఉన్నాయి.. కార్పెంటర్‌గా పనిచేస్తున్న మాతురాజు తూబరహళ్లిలో నివాసముంటున్న తన బావ బాలాజీ ఇంటిలోనే ఉంటున్నాడు. మాతురాజుకు మొదటి భార్య ద్వారా ఒక కుమార్తె, ఒక కుమారుడు ఉన్నాడు. దంపతులు ఈ మధ్య విడాకులు తీసుకున్నారు. కుమార్తె తల్లి వద్ద ఉండగా కుమారుడిని తన వద్దనే ఉంచుకున్నాడు. ఇదిలా ఉండగా ఆరు నెలల క్రితం కాకినాడకు చెందిన లోవా అనే మహిళను మాతురాజు రెండో వివాహం చేసుకున్నాడు. ఇటీవల వారి మధ్య గొడవలు మొదలయ్యాయి. జీవితంపై విరక్తి చెందిన మాతురాజు ఆరోగ్యం కూడా సహకరించకపోవడంతో దీంతో శనివారం ఉదయం తాను ఉంటున్న గదిలో చీరతో మొదటి కుమారుడికి ఉరి వేసి అనంతరం తాను కూడా ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఇది గమనించిన మాతురాజు అక్క, బావ స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.


