చురుగ్గా ‘ఫ్యాషన్ డిజైనర్’ చిత్రీకరణ
మామిడికుదురు : గోదావరి అందాలను తనదైన శైలిలో చిత్రీకరించి చక్కటి హాస్యంతో పాటు ప్రేమకథతో మూడు దశాబ్దాల క్రితం తెలుగు పేక్షకులకు చక్కటి వినోదాన్ని పంచిన లేడీస్ టైలర్ చిత్రానికి సీక్వెల్‌గా మధుర ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై ప్రముఖ దర్శకుడు వం
మామిడికుదురు : గోదావరి అందాలను తనదైన శైలిలో చిత్రీకరించి చక్కటి హాస్యంతో పాటు ప్రేమకథతో మూడు దశాబ్దాల క్రితం తెలుగు పేక్షకులకు చక్కటి వినోదాన్ని పంచిన లేడీస్ టైలర్ చిత్రానికి సీక్వెల్‌గా మధుర ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై ప్రముఖ దర్శకుడు వంశీ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘ఫ్యాషన్ డిజైనర్’ సన్ ఆఫ్ లేడీస్ టైలర్ అనేది దీనికి ట్యాగ్‌లైన్. ఈ చిత్రం షూటింగ్ వైనతేయ గోదావరి నదీతీరం పెదపట్నంలో బుధవారం జరిగింది. ఈ సందర్భంగా నటులు సుమంత్ అశ్విన్, కృష్ణుడు సాక్షితో ముచ్చటించారు.
కుటుంబ, వినోదాత్మక చిత్రాలే లక్ష్యం
ఏడు సినిమాల్లో హీరోగా నటించా
సుమంత్ అశ్విన్
సినిమాలంటే మక్కువతోనే ఈ రంగంలోకి వచ్చానని వర్ధమాన నటుడు, ప్రముఖ నిర్మాత ఎంఎస్ రాజు తనయుడు సుమంత్ అశ్వి¯ŒS అన్నారు. షూటింగ్ విరామ సమయంలో కొద్దిసేపు ఆయన స్థానిక విలేకర్లతో మాట్లాడారు. బీకామ్ వరకు చదువుకున్న తాను సినిమాలపై ఉండే ఆసక్తితో ఈ రంగంలో అడుగు పెట్టానని. ‘కేరింత’, ‘అంతకుముందు ఆ తరువాత’, ‘లవర్స్’, తదితర చిత్రాల్లో హీరోగా నటించానన్నారు. ప్రేక్షకులను ఆకట్టుకునే కుటుంబ కధ, వినోదాన్ని పంచే చిత్రాల్లో నటించాలన్నది తన లక్ష్యమని పేర్కొన్నారు.
వినాయకుడు గుర్తింపునిచ్చింది
అందరి మన్ననా పొందడమే లక్ష్యం
కథానాయకుడు కృష్ణుడు
ఇప్పటివరకూ 20 చిత్రాల్లో హీరోగా నటించినా వినాయకుడు తనకు గుర్తింపు ఇచ్చిందని నటుడు కృష్ణుడు పేర్కొన్నారు. హీరో కమ్ క్యారెక్టర్ ఆర్టిస్టు పేరు తెచ్చుకున్న రాజోలు ప్రాంతీయుడైన ఆయన మండల పరిధిలోని వైనతేయ గోదావరి నదీతీరం పెదపట్నంలో బుధవారం ప్రముఖ దర్శకుడు వంశీ దర్శకత్వంలో రూపొందుతున్న ‘ఫ్యాష¯ŒS డిజైనర్’ స¯ŒSఆఫ్ లేడీస్ టైలర్ ట్యాగ్‌లై¯ŒSతో రూపొందుతున్న చిత్రం షూటింగ్‌లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కొద్దిసేపు ఆయన స్థానిక విలేకర్లతో మాట్లా ప్రేక్షకులను అలరించే అన్ని రకాల పాత్రల్లో నటించడం ద్వారా వారి మనన్నలు పొందాలన్నదే తన లక్ష్యమని చెప్పారు. ఫ్యాష¯ŒS డిజైనర్ స¯ŒS ఆఫ్ లేడీస్ టైలర్ చిత్రంలో ఒక విభిన్నమైన పశు వైద్యాధికారి పాత్రలో నటిస్తున్నానని చెప్పారు.