శ్రీరాంసాగర్‌ నీటిని వినియోగించుకోవాలి | farmers should use sriramsagar water | Sakshi
Sakshi News home page

శ్రీరాంసాగర్‌ నీటిని వినియోగించుకోవాలి

Oct 2 2016 11:56 PM | Updated on Oct 1 2018 2:09 PM

శ్రీరాంసాగర్‌ నీటిని వినియోగించుకోవాలి - Sakshi

శ్రీరాంసాగర్‌ నీటిని వినియోగించుకోవాలి

మండల రైతులు శ్రీరాంసాగర్‌ సాగు నీటిని వినిమోగించుకోవాలని మాజీ ఎమ్మెల్యే వేనేపల్లి చందర్‌ర్‌రావు, టీఆర్‌ఎస్‌ కోదాడ నియోజకవర్గ ఇన్‌చార్జి కన్మంతరెడ్డి శశిధర్‌రెడ్డి అన్నారు.

మోతె:  మండల రైతులు శ్రీరాంసాగర్‌ సాగు నీటిని వినిమోగించుకోవాలని మాజీ ఎమ్మెల్యే వేనేపల్లి చందర్‌ర్‌రావు, టీఆర్‌ఎస్‌ కోదాడ నియోజకవర్గ ఇన్‌చార్జి కన్మంతరెడ్డి శశిధర్‌రెడ్డి అన్నారు.ఆదివారం మండలంలోని రాఘవాపురం, నామారం గ్రామాల్లో పర్యటించి శ్రీరాంసాగర్‌ కాల్వలను పరిశీలించారు. మోతె మండలంలో చెర్వులు, కుంటలు పూర్తిగా నింపుకొనుటకు రైతులు స్వచ్ఛందంగా ముందుకు రావాలని కోరారు. రాఘవాపురం ,సిరికొండ, భల్లుతండాల్లోని ఎస్సారెస్పీ కెనాల్లలోకి సాగు నీరు వస్తున్నందుకు రైతులు ఆనందాన్ని వ్యక్తం చేశారు. వీరి వెంట రాఘవాపురం సర్పంచ్‌ మూడు కృష్ణ, ఎంపీటీసీ మధు, టీఆర్‌ఎస్‌ మండల నాయకులు, ఏలూరి వెంకటేశ్వరరావు, జి సుదర్శన్‌రెడ్డి, కార్యకర్తలు, రైతులు ఉన్నారు.

 

Advertisement
 
Advertisement
Advertisement