అంతర పంటలపై రైతుల ఆసక్తి | Farmers interested on inter-crops | Sakshi
Sakshi News home page

అంతర పంటలపై రైతుల ఆసక్తి

Jul 24 2016 5:25 PM | Updated on Jun 4 2019 5:16 PM

అంతర పంటలపై రైతుల ఆసక్తి - Sakshi

అంతర పంటలపై రైతుల ఆసక్తి

మండలంలో రైతులు అంతర పంటలపై ఆసక్తి చుపుతున్నారు. రెండేళ్ల నుంచి వర్షాలు లేక పంటలు పండకపోవడంతో ఈ ఏడాది రైతన్నలు అంతర పంటలు అధికంగా సాగు చేశారు.

పెద్దేముల్‌: మండలంలో రైతులు అంతర పంటలపై ఆసక్తి చుపుతున్నారు. రెండేళ్ల నుంచి వర్షాలు లేక పంటలు పండకపోవడంతో ఈ ఏడాది రైతన్నలు అంతర పంటలు అధికంగా సాగు చేశారు. మండలంలోని మారేపల్లి, నాగులపల్లి, తట్టెపల్లి, నర్సాపూర్‌, కోటపల్లి, అడ్కిచెర్ల తదితర గ్రామాల రైతులు కందిలో పెసర, మినుములో కంది పంటలు వేసి పంటలు సాగు చేశారు. అంతర పంటలు సాగు చేయటంతో ఓ పంట పాడైనా మరో పంట ఆదుకుంటుందని రైతులు అంటున్నారు. గతేడాది రైతన్నలు అధికంగా పత్తిపంట సాగు చేసేవారు. కానీ ఈ ఏడాది పప్పుదినుసుల పంటలు అధికంగా సాగు చేశారు. సుమారు ఐదు వేల ఎకరాలకు పైగా కంది, పెసర, మినుము తదితర పప్పుదినుసుల పంటలను సాగు చేశారని వ్యవసాయ అధికారులు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement