గుండెపోటుతో రైతు మృతి | farmer died by heart stroke | Sakshi
Sakshi News home page

గుండెపోటుతో రైతు మృతి

Mar 7 2017 1:04 AM | Updated on Oct 1 2018 2:44 PM

వైద్యంకోసం ప్రభుత్వాసుపత్రికి వచ్చిన ఓ రైతు గుండెపోటు కారణంగా అక్కడే మరణించాడు.

డోన్‌ టౌన్‌ : వైద్యంకోసం ప్రభుత్వాసుపత్రికి వచ్చిన ఓ రైతు గుండెపోటు కారణంగా అక్కడే మరణించాడు. ఈ ఘటన డోన్‌ ప్రభుత్వాసుపత్రిలో చోటుచేసుకుంది. మండల పరి«ధిలోని గోసానిపల్లెకు చెందిన గొర్ల మద్దయ్య (48) సోమవారం స్వల్ప అస్వస్థతకు గురయ్యాడు. కుటుంబ సభ్యులతో కలిసి చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చారు. వైద్యుని వద్దకు వెళ్తుండగా గుండెపోటు రావడంతో అక్కడే కుప్పకూలిపోయాడు. వైద్యులు వచ్చి పరీక్షించగా అప్పటికే ఆయన మరణించాడు. 
 

Advertisement
 
Advertisement
Advertisement