కరెంట్‌ షాక్‌తో యువ రైతు మృతి | farmer dead with current shak | Sakshi
Sakshi News home page

కరెంట్‌ షాక్‌తో యువ రైతు మృతి

Aug 23 2016 7:17 PM | Updated on Oct 1 2018 4:01 PM

వీణవంక మండలంలోని ఎల్బాకకు చెందిన ఎడెల్లి రాజశేఖర్‌రెడ్డి (28)అనే యువ రైతు విద్యుత్‌షాక్‌తో మృతి చెందాడు. రాజశేఖర్‌రెడ్డి తన రెండు ఎకరాల్లో వరి పంట వేశాడు.

వీణవంక: మండలంలోని ఎల్బాకకు చెందిన ఎడెల్లి రాజశేఖర్‌రెడ్డి (28)అనే యువ రైతు విద్యుత్‌షాక్‌తో మృతి చెందాడు. రాజశేఖర్‌రెడ్డి తన రెండు ఎకరాల్లో వరి పంట వేశాడు. రెండ్రోజుల క్రితం ఎల్‌ఎండీ నుంచి కాలువల ద్వారా నీటిని విడుదల చేయడంతో ఎల్బాక గ్రామానికి డీబీఎం–6 కెనాల్‌కు నీళ్లు చేరాయి.  పంటను కాపాడుకోవడానికి రాజశేఖర్‌రెడి సోమవారం రాత్రి కెనాల్‌కు బిగించిన మోటర్‌ను సరి చేస్తుండగా ప్రమాదవశాత్తు కరెంట్‌ షాక్‌కు గురయ్యాడు. గమనించిన తండ్రి బంధువులకు సమాచారం ఇవ్వడంతో  108లో కరీంనగర్‌ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమ«ధ్యలో మతి చెందాడు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేశారు. మృతుడికి భార్య కవిత, కుమారుడు, కూతురు ఉన్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement