ముదిగుబ్బలో ఆగిన ఎక్స్‌ప్రెస్‌ రైలు | express trains stop in mudigubba | Sakshi
Sakshi News home page

ముదిగుబ్బలో ఆగిన ఎక్స్‌ప్రెస్‌ రైలు

Mar 10 2017 12:11 AM | Updated on Sep 5 2017 5:38 AM

ముదిగుబ్బలో ఆగిన ఎక్స్‌ప్రెస్‌ రైలు

ముదిగుబ్బలో ఆగిన ఎక్స్‌ప్రెస్‌ రైలు

సికింద్రాబాద్‌ నుంచి తిరుపతి వెళ్లే పద్మావతి ఎక్స్‌ప్రెస్‌ రైలు గురువారంముదిగుబ్బ రైల్వే స్టేషన్‌లో ఆగింది.

ముదిగుబ్బ : సికింద్రాబాద్‌ నుంచి తిరుపతి వెళ్లే పద్మావతి ఎక్స్‌ప్రెస్‌ రైలు గురువారంముదిగుబ్బ రైల్వే స్టేషన్‌లో ఆగింది.  స్థానికులు పెద్ద సంఖ్యలో రైల్వే స్టేషన్‌కు చేరుకొని రైలుకు పూలమాల వేసి, కొబ్బరి కాయ కొట్టి పూజలు  చేశారు. ముదిగుబ్బలో ఎక్స్‌ప్రెస్‌ రైళ్లను ఆపాలని సుదీర్ఘకాలంగా మండల ఉన్నతాధికారులకు  విజ్ఞప్తి చేశారు. దీనిపై అధికారులు స్పందించి నేటి నుంచి ఆరు నెలల పాటు పద్మావతి ఎక్స్‌ప్రెస్‌ రైలును ఆపాలని అధికారులు నిర్ణయించారు. రిజర్వేషన్, టికెట్ల అమ్మకం ద్వారా రోజుకు రూ.7 వేలు ఆదాయం ఉంటేనే ఆరు నెలల తర్వాత కూడా రైలు ఆపుతారు, లేకపోతే నిలపరు. ప్రతి ఆది, గురువారాల్లో   రైలు సికింద్రాబాద్‌ నుంచి తిరుపతికి వెళ్తూ ఉదయం 5:40కు ముదిగుబ్బ రైల్వే స్టేషన్‌కు చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో అదేరోజు రాత్రి 8:40కు ముదిగుబ్బకు వస్తుంది. కాగా అన్ని ఎక్స్‌ప్రెస్‌రైళ్లను ఆపాలని మండల ప్రజలు కోరుతున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement