breaking news
express trains stop
-
నో స్టాప్..!
భువనగిరి : జిల్లా కేంద్రంలోని రైల్వే స్టేషన్లో పలు ఎక్స్‌ప్రెస్ రైళ్లు ఆగకపోవడంతో ప్రయాణికులు నరకయాతన పడుతున్నారు. ప్రతి రోజూ రైల్వే స్టేషన్నుంచి వందలాది మంది హైదరాబాద్‌కు రాకపోకలు సాగిస్తుంటారు. ప్రయాణికుల సంఖ్యకు అనుగుణంగా రైళ్లు ఆగకపోవడంతో గంటల తరబడి ఎదురుచూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. కొన్ని సందర్భాల్లో ప్రయాణం రద్దు చేసుకుంటున్నారు. కొనుగోలు చేసిన టికెట్లతో నష్టపోవాల్సి వస్తోంది. పద్మావతి, శాతవాహన, షిరిడీ, ఎల్టీడీ ఎక్స్‌ప్రెస్ రైళ్లను భువనగిరి రైల్వే స్టేషన్లో నిలపాలని కొన్నేళ్లుగా కోరుతున్నా ఆ శాఖ అధికారులనుంచి స్పందన కరువైంది. భువనగిరి మీదుగా వెళ్లే రైళ్లు.. ప్రస్తుతం భువనగిరి రైల్వే స్టేషన్ మీదుగా ఇంటర్సిటీ ఎక్స్‌ప్రెస్(హైదరాబాద్ నుంచి సిర్పూర్ కాగజ్‌నగర్), కృష్ణా, కొలహాపూర్ ఎక్స్‌ప్రెస్, ప్యాసిం జర్(ఫలక్నమా నుంచి భువనగిరి), ఇంటర్సిటీ ఎక్స్‌ప్రెస్(సికింద్రాబాద్ నుంచి గుంటూరు), కాగజ్‌నగర్ ఎక్స్‌ప్రెస్(సికింద్రాబాద్ నుంచి సిర్పూర్ కాగజ్‌నగర్), ఈస్ట్‌కోస్ట్ ఎక్స్‌ప్రెస్(హైదరాబాద్ నుంచి హౌరా), పుష్పుల్ ప్యాసింజర్ (హైదరా బాద్ నుంచి వరంగల్), గోల్కొండ ఎక్స్‌ప్రెస్ (సికింద్రాబాద్‌నుంచి గుంటూరు), ప్యాసిం జర్(ఫలక్నామానుంచి జనగాం), భాగ్యనగర్ ఎక్స్‌ప్రెస్ (సికింద్రాబాద్ నుంచి బల్హార్షా), కాకతీయ ప్యాసింజర్(సికింద్రాబాద్ నుంచి మ ణుగూరు), పుష్ పుల్(హైదరాబాద్ నుంచి కాజీ పే ట), గౌతమి(లింగంపల్లి నుంచి కాకినాడ), దక్షిణ ఎక్స్‌ప్రెస్(హైదరాబాద్ నుంచి నిజాముద్దీన్) రైళ్లు సికింద్రాబాద్, కాజీపేట వైపు రాకపోకలు సాగిస్తుంటాయి. ఆగని రైళ్లు.. భువనగిరి రైల్వే స్టేషన్ నుంచి నిత్యం సుమారు 2,000 మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తుంటారు. ఇందులో సుమారు 500 మంది ప్రతి రోజూ హైదరాబాద్‌లో ఉద్యోగ నిమిత్తం వెళ్లి వస్తుంటారు. ప్రస్తుతం భువనగిరి మీదగా వివిధ రకాల రైళ్లు రాకపోకలు సాగిస్తున్నాయి. ఇందులో శాతవాహన, పద్మావతి, షిరిడీ, ఎల్టీడీ ఎక్స్‌ప్రెస్ రైళ్లు ఉన్నాయి. కానీ, వీటిలో ఏ ఒక్కటీ ఆగడం లేదు. కాజీపేట వైపు, సికింద్రాబాద్ వైపు వెళ్లేటప్పడు గానీ ఈ రైళ్లు ఆగకపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. తక్కువ వ్యవధిలో రైళ్లు లేకపోవడంతో గంటల తరబడి ఎదురుచూడాల్సిన వస్తుంది. ఉదయం కాజీపేట వైపు నుంచి సికింద్రాబాద్ వైపు భాగ్యనగర్ ఎక్స్‌ప్రెస్ ఉదయం 9.17 నిమిషాలకు ఉంటే ఆ తర్వాత గోల్కొండ ఎక్స్‌ప్రెస్ 12.04 గంటలకు, ఆ తర్వాత ఈస్ట్‌కోస్ట్ ఎక్స్‌ప్రెస్ 3.57 గంటలకు రైలు ఉంది. దీంతో ఈ రైళ్ల రాకపోకల మధ్య సుమారు 3నుంచి 4 గంటలు çసమయం పడుతుంది.ఈ సమయంలో వచ్చిన రైళ్లు రద్దీగా రావడంతో ఎక్కలేని పరిస్థితి ఉండడం వల్ల బుక్ చేసుకున్న టికెట్లను నిత్యం 50నుంచి 70 వరకు రద్దు చేసుకుంటున్నారు. కొన్ని సందర్భాల్లో టికెట్లు రద్దు చేసుకున్న సమయం దాటిపోవడంతో ప్రయాణికులు నష్టపోతున్నారు. భువనగిరి స్టేషన్ నుంచి షిరిడీ, తిరుపతికి ఎక్కువ సంఖ్యలో వెళ్తుంటారు. దీంతో షిరిడీ, పద్మావతి ఎక్స్‌ప్రెస్ రైళ్లు ఆగితే ప్రయాణికులకు మేలు జరుగుతుంది. కేంద్ర మంత్రిని కోరాం భువనగిరి రైల్వే స్టేషన్ మీదుగా వెళ్లే రైళ్లతో పాటు పద్మావ తి, శాతవాహన ఎక్స్‌ప్రెస్‌లను నిలపాలని సంబంధిత కేంద్ర మంత్రిని కోరాం. ఇప్పటికే సికింద్రాబాద్ రైల్వే జీఎం కూడా శాతవాహన ఎక్స్‌ప్రెస్ రైళ్లు భువనగిరి రైల్వే స్టేషన్లో నిలపటానికి సంబంధించిన నివేధిక కూ డా ఉన్నతాధికారులకు పంపించారు. రైల్వే స్టేషన్లో కనీసం రెండు రైళ్లన్న నిలిపే ప్రయత్నాలు జరుగుతున్నాయి. –డాక్టర్ బూర నర్సయ్యగౌడ్, ఎంపీ -
ఎక్స్‌ప్రెస్ రైళ్లకు హాల్టింగ్ ఇవ్వండి: ఈటల
సాక్షి, న్యూఢిల్లీ: పలు ఎక్స్‌ప్రెస్ రైళ్లకు రాష్ట్రంలో హాల్టింగ్ సదుపాయం కల్పించాలని కేంద్ర రైల్వే మంత్రి పియూష్ గోయల్‌ను మంత్రి ఈటల రాజేందర్ కోరారు. ఈటల నేతృత్వంలోని ఎంపీలు వినోద్ కుమార్, కొండా విశ్వేశ్వరరెడ్డి బృందం సోమవారం ఢిల్లీలో కేంద్ర మంత్రితో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ముంబై–నిజామాబాద్ రైలును కరీంనగర్ వరకు పొడిగించాలని వినతిపత్రాన్ని అందజేశారు. అంతేకాకుండా కాగజ్‌నగర్–సికింద్రాబాద్ ఎక్స్‌ప్రెస్‌కు ఉప్పల్‌లో, ఇంటర్సిటీ, పట్నా ఎక్స్‌ప్రెస్‌కు జమ్మికుంటలో హాల్టింగ్ ఇవ్వాలని కోరారు. మరోవైపు రాష్ట్రంలో చేపడుతున్న ఫ్లైఓవర్ల నిర్మాణాలకు రైల్వే శాఖ నుంచి రావాల్సిన అనుమతులను త్వరగా మంజూరు చేయాలని ఈటల కోరారు. -
ముదిగుబ్బలో ఆగిన ఎక్స్‌ప్రెస్ రైలు
ముదిగుబ్బ : సికింద్రాబాద్ నుంచి తిరుపతి వెళ్లే పద్మావతి ఎక్స్‌ప్రెస్ రైలు గురువారంముదిగుబ్బ రైల్వే స్టేషన్లో ఆగింది. స్థానికులు పెద్ద సంఖ్యలో రైల్వే స్టేషన్‌కు చేరుకొని రైలుకు పూలమాల వేసి, కొబ్బరి కాయ కొట్టి పూజలు చేశారు. ముదిగుబ్బలో ఎక్స్‌ప్రెస్ రైళ్లను ఆపాలని సుదీర్ఘకాలంగా మండల ఉన్నతాధికారులకు విజ్ఞప్తి చేశారు. దీనిపై అధికారులు స్పందించి నేటి నుంచి ఆరు నెలల పాటు పద్మావతి ఎక్స్‌ప్రెస్ రైలును ఆపాలని అధికారులు నిర్ణయించారు. రిజర్వేషన్, టికెట్ల అమ్మకం ద్వారా రోజుకు రూ.7 వేలు ఆదాయం ఉంటేనే ఆరు నెలల తర్వాత కూడా రైలు ఆపుతారు, లేకపోతే నిలపరు. ప్రతి ఆది, గురువారాల్లో రైలు సికింద్రాబాద్ నుంచి తిరుపతికి వెళ్తూ ఉదయం 5:40కు ముదిగుబ్బ రైల్వే స్టేషన్‌కు చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో అదేరోజు రాత్రి 8:40కు ముదిగుబ్బకు వస్తుంది. కాగా అన్ని ఎక్స్‌ప్రెస్‌రైళ్లను ఆపాలని మండల ప్రజలు కోరుతున్నారు.