ఓటు హక్కు విలువను చాటి చెప్పండి | explain the value of the right to vote | Sakshi
Sakshi News home page

ఓటు హక్కు విలువను చాటి చెప్పండి

Jan 23 2017 11:57 PM | Updated on Sep 5 2017 1:55 AM

జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని పెద్ద ఎత్తున నిర్వహించి అన్ని వర్గాల ప్రజలకు ఓటుహక్కు విలువను చాటి చెప్పాలని జిల్లా కలెక్టర్‌ సీహెచ్‌ విజయమోహన్‌ అధికారులను ఆదేశించారు.

కర్నూలు(అగ్రికల్చర్‌): జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని పెద్ద ఎత్తున నిర్వహించి అన్ని వర్గాల ప్రజలకు ఓటుహక్కు విలువను చాటి చెప్పాలని జిల్లా కలెక్టర్‌ సీహెచ్‌ విజయమోహన్‌ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టర్‌ తన క్యాంపు కార్యాలయంలో జాతీయ ఓటర్ల దినోత్సవం ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్బంగా కలెక్టర్‌ మాట్లాడుతూ.. ఓటర్ల దినోత్సవాన్ని పురష్కరించికుకొని ఈ నెల 25న భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించాలని సూచించారు.  ప్రతి ఏడాది జనవరి 25న పోలింగ్‌ కేంద్రం స్థాయి నుంచి జిల్లా కేంద్రం వరకు జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇందులో బాగంగా ఉదయం 9 గంటలకు కలెక్టరేట్‌ నుంచి పోలీసు పేరెడ్‌ గ్రౌండు వరకు నిర్వహించే మెగా ర్యాలీలో అన్ని విధ్యాసంస్థలతో పాటు అన్ని శాఖల ఉద్యోగులు, అధికారులు పాల్గొనాలని వివరించారు.   
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement