అక్రమ మద్యం విక్రయాలపై ఎక్సైజ్‌ దాడులు | exise checking | Sakshi
Sakshi News home page

అక్రమ మద్యం విక్రయాలపై ఎక్సైజ్‌ దాడులు

Oct 15 2016 11:05 PM | Updated on Sep 4 2017 5:19 PM

జిల్లాలో సారాతో పాటు అక్రమ మద్యం అమ్మకం దార్లపై నిరంతరంగా తమ సిబ్బంది దాడులు నిర్వహిస్తుందని ఎక్సైజ్‌ డెప్యూటీ కమిషనర్‌ (డీసీ) వైబీ భాస్కరరావు స్పష్టం చే శారు. శనివారం జిల్లావ్యాప్తంగా చింతలపూడి, కొవ్వూరు. పోలవరం, నరసాపురం, జంగారెడ్డిగూడెం ప్రాంతాల్లో ఎక్సైజ్‌ అ«ధికారులు సారా తయారీ కేంద్రాలు, అక్రమ మద్యం విక్రయాలు, సమయ వేళలు పాటించని దుకాణాలపై దాడులు నిర ్వహించారు.

ఏలూరు అర్బన్‌ : జిల్లాలో సారాతో పాటు అక్రమ మద్యం అమ్మకం దార్లపై నిరంతరంగా తమ సిబ్బంది దాడులు నిర్వహిస్తుందని ఎక్సైజ్‌ డెప్యూటీ కమిషనర్‌ (డీసీ) వైబీ భాస్కరరావు స్పష్టం చే శారు. శనివారం జిల్లావ్యాప్తంగా చింతలపూడి, కొవ్వూరు. పోలవరం, నరసాపురం, జంగారెడ్డిగూడెం ప్రాంతాల్లో ఎక్సైజ్‌ అ«ధికారులు సారా తయారీ కేంద్రాలు, అక్రమ మద్యం విక్రయాలు, సమయ వేళలు పాటించని దుకాణాలపై దాడులు నిర ్వహించారు. ఈ సందర్భంగా నిర్ణీత వేళలు పాటించని రెండు దుకాణాలపై కేసులు నమోదు చేశారు. అదే క్రమంలో సారా తయారు చేస్తున్న ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకుని వారి నుంచి 100 లీటర్ల సారా, 18 మద్యం బాటిళ్లు స్వాధీనం చేసుకున్నారు. అక్రమంగా మద్యం విక్రయిస్తున్న వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారని డీసీ భాస్కరరావు తెలిపారు. నిందితులను కోర్టులో హాజరుపరిచామన్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement