భూసర్వే అధికారుల సంఘం అధ్యక్షుడిగా ఎస్.నరహరిరావు | Esnarahariravu president of the executive committee for land survey | Sakshi
Sakshi News home page

భూసర్వే అధికారుల సంఘం అధ్యక్షుడిగా ఎస్.నరహరిరావు

Aug 1 2016 5:56 PM | Updated on Mar 28 2018 11:26 AM

రాష్ట్ర సర్వే, ల్యాండ్ రికార్డ్స్ గెజిటెడ్ ఆఫీసర్ల సంఘం అధ్యక్షుడిగా ఎస్.నరహరిరావు నియమితులయ్యారు.

రాష్ట్ర సర్వే, ల్యాండ్ రికార్డ్స్ గెజిటెడ్ ఆఫీసర్ల సంఘం అధ్యక్షుడిగా ఎస్.నరహరిరావు(రంగారెడ్డి జిల్లా) నియమితులయ్యారు. హైదరాబాద్‌లోని సర్వే భవన్‌లో ఆదివారం జరిగిన సమావేశంలో కొత్త కమిటీని ఎన్నుకున్నారు. ప్రధాన కార్యదర్శులుగా ఎం.శ్రీనివాసరావు, ఉపాధ్యక్షులుగా ఆర్.దేవుజీ, రాము, కార్యదర్శులుగా కె.శ్రీనివాసులు, ఐనేశ్, , కోశాధికారిగా పి.దేవరాజ్, కార్యవర్గ సభ్యుడిగా కృష్ణారావును ఎంపిక చేశారు. భూ సర్వే, రికార్డు అధికారులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళుతుందని, సంఘం పటిష్టతకు కృషి చేస్తానని కొత్త అధ్యక్షుడు నరహరిరావు ఒక ప్రకటనలో స్పష్టం చేశారు.

 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement